అంతర్జాతీయం

విమానంపై స్టంట్ చేస్తూ..కెనడా రాపర్ జేమ్స్ దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టొరొంటో, అక్టోబర్ 24: కెనడాకు చెందిన రాపర్ జాన్ జేమ్స్ మెక్‌ముర్రే ఒక విమానంపై స్టంట్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. 34 ఏళ్ల జాన్ జేమ్స్ రాప్ మ్యూజిక్ చేస్తూ విమానం రెక్కపై నడుస్తూ స్టంట్ చేయాల్సి ఉంది. ఈ స్టంట్ కోసం ఆయన తీవ్రస్థాయిలో శిక్షణ కూడా తీసుకున్నారు. అయితే, శనివారం ఈ దృశ్యం చిత్రీకరణ సందర్భంగా విమాన గమనంలో తీవ్రమయిన తప్పిదం జరిగింది. పైలట్ దానిని నియంత్రించలేకపోయారు. దీంతో జేమ్స్ విమానం రెక్కపై నుంచి కింద పడి మృతి చెందారని ఆయన మేనేజ్‌మెంట్ టీమ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎప్పుడూ చిరుదరహాసంతో ఉండే జాన్ జేమ్స్ ఎవరి గురించీ చెడుగా మాట్లాడేవాడు కాదని ఆ ప్రకటనలో పేర్కొంది. ఆయనది నిజంగా పసిడి హృదయమని అభివర్ణించింది. అయితే, ఈ స్టంట్ దృశ్యం చిత్రీకరణ కోసం ఉపయోగించిన విమానం తరువాత భద్రంగా ల్యాండ్ అయింది. జాన్ జేమ్స్ మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది. అల్బెర్టాలోని కాల్గరిలో జన్మించిన జాన్ జేమ్స్ గతంలో ప్రొఫెషనల్ స్కయర్. అయితే, వెనె్నముకకు గాయం కావడం వల్ల ఆయన ఆ వృత్తిని విరమించుకొని, మ్యూజిక్ రంగంలోకి ప్రవేశించారు.

చిత్రం..జాన్ జేమ్స్ మెక్‌ముర్రే (ఫైల్‌పొటో)