అంతర్జాతీయం

నేను అమాయకుడిని, వదిలేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, అక్టోబర్ 24: నేను నిర్దోష్టిని, నాకు ఏమీ తెలియదు. నన్ను ఈ కేసు నుంచి విముక్తి చేయండి అంటూ మార్సెలీ థామస్ అనే భారతీయుడు శ్రీలంక కోర్టుకు విన్నవించారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాలా సిరిసేన హత్యకు కుట్రపన్నారనే అభియోగంపై థామస్‌ను కొలంబో పోలీసులు అరెస్టు చేసి ఫోర్ట్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని, తాను అమాయకుడని, వేధించవద్దని ఈ కేసులో నిందితుడిగా ముద్రపడిన థామస్ కోర్టును అభ్యర్థించారు. తనను 34 రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అప్పటి నుంచి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. అవినీతి వ్యతిరేక సంస్థ ప్రతినిధి అని చెప్పుకుంటున్న నామల్ కుమారా అనే వ్యక్తి ఫిర్యాదుపై థామస్‌ను కొలంబో పోలీసులు అరెస్టు చేశారు. థామస్ దేశాధ్యక్షుడినేకాకుండా కేంద్ర హోంశాఖ అధికారులను కూడా హతమార్చేందుకు కుట్రపన్నాడని అభియోగం. గత వారం శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన తన హత్యకు కుట్ర జరుగుతోందని అభియోగం మోపారు. భారత్ నిఘా విభాగం రా ఈ కుట్రకు వ్యూహం పన్నిందని అధ్యక్షుడు భావిస్తున్నారని శ్రీలంక అత్యున్నత వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.