స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-130

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ పసిబిడ్డ నున్నని బుగ్గలమీద నీ చేతినుంచి జాగ్రత్తగా పరిశీలించు. ప్రాణప్రథమ స్పందన స్పష్టంగా అక్కడ కనబడుతుంది. ఈ విధంగా ప్రాణాలు క్రిందినుండి పైకిపోయే తమ సంచారాన్ని తెలుపుతూ ఉంటాయి. ఆ ప్రాణ సంచారాన్ని చాలామంది గుర్తించలేరు. కాని ‘శ్రుణోతి కశ్చి దేషామ్’ ఎవరో కొద్దిమంది మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఒక దినమంతా ప్రాణాల సంచార శబ్దాన్ని విను. వానిని నిరోధించు. నీ దేహగతమైన మేరుదండం చలించిపోగలదు. తదుపరి సుషుమ్నానాడి జాగృతమవుతుంది. ఇక చెప్పేదేముంది? సుషుమ్నా నాడిని జాగృతపరచేందుకు సమయం కూడ నిర్ణయింపబడింది. ఇక దినమంతా స్థిరమైన ఆసనంలో ఉండి ప్రాణసంచారాన్ని నిలుపగలిగితే సుషుమ్న మేల్కొంటుంది. అనుభవజ్ఞులు తమ అనుభవంచేత దీనిని పరిపుష్టం చేస్తారు.
**
నా బుద్ధికి గురి దైవమే
పరా మే యంతి ధీతయో గావో న గవ్యూతీరను
ఇచ్ఛం తీరురుచక్షసమ్‌॥ ఋ.1-25-16॥
భావం:- ఆవులు తమతమ గోశాలలకేవిధంగా వెళుతూ ఉంటాయో అదే విధంగా నా బుద్ధులు సర్వమూ దర్శించిన ద్రష్టను- దర్శింపజేయగల దర్శకుని కోరుకుంటూ ఆయనే లక్ష్యంగా చేసుకొని దూరంగా వెళుతూ ఉన్నాయి.
వివరణ:- భగవత్సన్నిధికి చేరుకొన్న వ్యక్తి భయపడి-
ప్ర దేవ వరుణ వ్రతమ్‌ మినీమసి ద్యవిద్యవి॥ (ఋ.1-25-1)
‘’‘ఓ దేవా! ప్రతి దినమూ నీవుచెప్పిన నియమాలను ఉల్లంఘిస్తున్నాము’’ కాని
మా నో వధాయ హత్న వే జిహీళా నస్య రీరధః
మా హృణానస్య మన్యవే (ఋ.1-25-2)
‘‘మా అపరాధాలకు శిక్షగా మరణానికి గురిచేయకు’’అని ప్రార్థిస్తాడు. అయితే భగవానుని కృపాళుత్వాన్ని దలంచి
అశ్వం స సందితమ్‌ గీర్భివరుణ సీ మహి॥ (ఋ.1-25-3)
‘‘ఓ వరుణదేవా! త్రాళ్ళతో కట్టబడిన గుఱ్ఱంలా మమ్ము నీ ఉపదేశ వచనాలు బంధిస్తున్నాయి’’అని విధేయతను ప్రకటిస్తాడు.
ఎంత చిత్రం!!! చేసిన అపరాధాలకు భయం-గాభరా. మరల దేవా! నీ మాటలకు కట్టుబడి ఉంటానని వాగ్దానం. గుఱ్ఱాన్ని కట్టడానికి త్రాడు అవసరం. కాని ఇతనిని కట్టడానికి మాటలు చాలు. మరీ చౌకబేరం కదా. వరుణుడు బంధించాడు. సారథి పదే పదే గుఱ్ఱాలవైపు చూస్తాడు. ఇతను కూడ తన ఆదేశాలతో తనను కట్టిన వరుణునిచూస్తూ ‘పరా మే యంతి ధీతయో గావో న గవ్యూతీరను’ ఆవులు తమ గొడ్లశాలకు వేగంగా ఎలా వెళతాయో అదే విధంగా నా బుద్ధులు ఆయననే (వరుణునే) లక్ష్యంగా చేసుకొని చాలదూరంవరకు పరుగిడుతున్నాయి. ఎక్కడనుంచి ఎక్కడకు చేరుకొన్నాయి? ఇప్పుడు బుద్ధివిషయాల వైపుకుపోవడం లేదు. సంసారం నుండి విముఖమైపోయింది. ఆవులు తమ గోశాలనుండి గడ్డికోసమో లేదా దూడకోసమో ఆతృతతో పోయే విధంగా నా బుద్ధి ‘ఇచ్ఛంతీ రురు చక్షసమ్’ మహాద్రష్టను మహాదర్శకుడిని కోరుకొంటూంది. ఈ విషయమే ఇదే సూక్తంలోని నాల్గవ మంత్రంలో ఇలా వివరింపబడింది.
పరా హి మే విమన్యవః పతంతి వస్య ఇష్టయే వయో న వసతీరుప॥ (ఋ.1-25-4)
‘‘పక్షులు తమ గూళ్ళనుండి ఎగిరి ఆహారంకోసం దూరంగా ఎలా పోతాయో అదే రీతిగా నా ఆలోచనలు కోరుకొన్న ఇష్టప్రాప్తి కొఱకై చాలా దూరం ఎగిరిపోతూ ఉంటాయి’’ ఇష్టాపూర్తికై ఎగిరిన నాకు జ్ఞానం కలిగిన తరువాత అదే వస్య= అభిలషించతగినది అదే ఇష్టమయినదని మరియు అదే దర్శింపదగినది, దర్శకమయినది ఇతరమైనవన్ని వినాశనమయ్యేవని ఎరుక కలుగుతుంది. అందుచేతనే దానివైపునకే బుద్ధి పరుగుపెడుతూ ఉంది. అట్టి బుద్ధిమంతుడు ఆత్మవిశ్వాసంతో ఇలా అంటున్నాడు.
ఇమం మే వరుణ శ్రుధీ హవమద్యా చ మృళయ
త్వామ వస్యురా చకే॥ (ఋ.1-25-19)
ఓ వరుణదేవా! నా రుూ ఆక్రోశాన్ని విని నేడే నన్ను దయచూడు. నీ ఎడల భక్త్భివంతో స్తోత్రం చేస్తున్నాను.
**
పరమాత్మ జీవుణ్ణి హృదయ గుహలో కలుసుకొంటాడు
పూషా రాజాన మఘృణిరపగూళ్హం గుహాహితం
అవింద చ్చిత్ర బర్హిషమ్‌॥ ఋ.1-23-14॥ ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు