క్రీడాభూమి

నిర్లక్ష్యానికి మూల్యం చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 5: తమ జట్టు సభ్యులమంతా నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లే టీమిండియాతో కోల్‌కతా ఈడెన్ గార్డెన్‌లో ఆదివారం జరిగిన తొలి టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో తగిన మూల్యం చెల్లించుకున్నామని వెస్టిండీస్‌లో తొలిసారిగా చోటు దక్కించుకున్న క్రికెటర్ ఫబియాన్ అలెన్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో అలెన్ 20 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు. విండీస్ జట్టులో ఇదే అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్‌లో కరేబియన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. టీమిండియాలో తొలిసారిగా చోటు దక్కించుకున్న కృణాల్ పాండ్య, చైనామన్ కుల్దీప్ యాదవ్ విండీస్ బ్యాట్స్‌మన్ వెన్నువిరిచారు. పరుగులు తీయడంలో బ్యాట్స్‌మెన్‌లు ఆపసోపాలు పడుతున్న తరుణంలో బరిలోకి వచ్చిన 23 ఏళ్ల అలెన్ దూకుడుగా ఆడుతూ జట్టు స్కోరును వందకు దాటించాడు. ఈ మ్యాచ్‌లో తాము కనీసం 140-150 మధ్య పరుగులు చేయగలమని ఆశించామని, కానీ బ్యాటింగ్‌లో అంతా విఫలమయ్యామని పేర్కొన్నాడు. తొలి మ్యాచ్‌లో చేసిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా అత్యంత జాగురూకతతో వ్యవహరిస్తామని అన్నాడు. మంగళవారం లక్నో జరిగే రెండో మ్యాచ్‌లో భారత్‌పై పైచేయి సాధించేందుకు తగిన ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు తెలిపాడు.