తెలంగాణ

కూటమిలో చేరేందుకు మరిన్ని పార్టీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: కూటమిలో చేరేందుకు మరిన్ని పార్టీలు ముందుకు వస్తున్నాయి. జనతాదళ్ (ఎస్), ముస్లీం లీగ్, తెలంగాణ లేబర్ పార్టీలు మహాకూటమితో కలిసి పని చేసేందుకు ఆసక్తి కనబరస్తున్నాయి. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఇదివరకే కూటమిలో చేరేందుకు ముందుకు వచ్చారు. నకిరేకల్ సీటును ఆయన కోసం కూటమి నేతలు వదిలినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నకిరేకల్ సీటును తెలంగాణ ఇంటి పార్టీకి ఇస్తే సహించేది లేదని కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చినట్టు సమాచారం. చిరుమర్తి లింగయ్యకే టిక్కెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో దుబాయి నుంచి కుంతియా, ఉత్తమ్ వారితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. టిక్కెట్ ఇంకా ఎవరికీ కేటాయించలేదని, హైదరాబాద్ వచ్చిన తర్వాత మాట్లాడుదామని వారు చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇలాఉండగా ఇప్పుడు కొత్తగా ముందుకు వచ్చిన పార్టీలూ ఎన్ని సీట్లు కోరుతాయోనన్న అనుమానాలను కూటమిలోని మిగతా భాగస్వామ్య పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాగా పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా దుబాయి వెళ్ళినందున, వారు వచ్చిన తర్వాతే ఈ పార్టీలతో చర్చించే అవకాశం ఉంది.