తెలంగాణ

హైదరాబాద్‌కు మరో టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: హైదరాబాద్ నగరానికి మరో ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం తరలిరాబోతుంది. టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్ సంస్థ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఇండియాలో ఇంటెల్ విస్తరణకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నట్టు ఇంటెల్ ఇండియా అధిపతి నివృతి రాయ్ వెల్లడించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో నివృతి రాయ్ సమావేశమయ్యారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే కేంద్రంలో సుమారు 15 వందల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆమె వివరించారు. భవిష్యత్‌లో ఈ కేంద్రంలో 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా ఇండియాలో ఇంటెల్ విస్తరణకు పూనుకున్నట్టు చెప్పారు. కంప్యూటర్ సర్వర్లు, ఎలక్ట్రానిక్ మరియు సెమీ కండక్టర్ పరికరాల తయారీకి అవసరమై అనుబంధ పరిశ్రమలను నెలకోల్పడానికి హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలపై అధికారులతో ఇంటెల్ ప్రతినిధులు ఈ సందర్భంగా చర్చించారు. హైదరాబాద్‌లో ఇంటెల్ కేంద్రాన్ని ఏర్పాటుకు ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రోత్సహానికి చేపట్టిన చర్యలను ఇంటెల్ ప్రతినిధి బృందానికి మంత్రి వివరించారు.