విశాఖపట్నం

పుస్తక పఠనంతో అపారమైన విజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, నవంబర్ 15: పుస్తక పఠనంతో అపారమైన విజ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చునని విశ్రాంత ప్రిన్సిపాల్ జీవీఎస్‌ఎన్. ఆచార్యులు అన్నారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా అడివివరం శాఖా గ్రంథాలయంలో రెండో రోజు గురువారం పుస్తక ప్రదర్శన జరిగింది. గ్రంథాలయంలోని చారిత్రక, విజ్ఞాన, పురాణ, ఇతిహాస గ్రంథాలతో పాటు అనేక పుస్తకాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను ప్రారంభించిన విశ్రాంత ప్రిన్సిపాల్ పాఠకులనుద్దేశించి మాట్లాడారు.సాంకేతికంగా ఎన్ని మాద్యమాలు అందుబాటులోకి వచ్చిన పుస్తకాలకున్న ప్రధాన్యత ఎప్పటికీ తరగనిదని ఆయన అన్నారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని జ్ఞానాన్ని పొందాలని ఆయన పాఠకులకు పిలుపునిచ్చారు. పరిసర ప్రాంతాలకు చెందిన పాఠశాలల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై పుస్తక ప్రదర్శనను తిలకించారు. గ్రంథాలయ అధికారిణి వై.పద్మజ, రాజేంద్రప్రసాద్ కార్యక్రమాన్ని నడిపించారు. విశ్రాంత ఉపాధ్యాయులు సూరిబాబు, సాహితీ ప్రియులు సత్యనారాయణ,నాగరాజు, లక్ష్మీ, చిన్న తదితరులు పాల్గొన్నారు

నిర్వాసితుల పట్ల ఉక్కు యాజమాన్యం కుట్ర
గాజువాక, నవంబర్ 15: భవిష్యత్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమల్లో నిర్వాసిత ఉద్యోగుల లేకుండా చేయాలని ఉక్కు యాజమాన్యం కుట్ర పన్నుతుందని అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు ఆరోపించారు. ఉక్కు నిర్వాసితులకు ఉపాధి కల్పించడంలో కచ్చితంగా 50శాతాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉక్కు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో గురురవారం స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం ముందు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమానికి జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, వైకాపా గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, సిపిఐ నేత బి.వెంకటరావుతో పాటు కార్మిక నేతలు డి. ఆదినారాయణ, ఎన్.రామారావు, జె. ఆయోధ్యరామ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాసితులనుద్ధేశించి నాయకులు మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమల్లో భవిష్యత్‌లో నిర్వాసిత ఉద్యోగుల లేకుండా యాజమాన్యం చేస్తున్న కుట్రను తిప్పికొట్టేందుకు ప్రతీ ఒక్కరు సిద్ధంగా ఉండాలన్నారు. ఉక్కు యాజమాన్యం ఇటీవల 640 పోస్టులను నింపేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందని, వాటిలో 320 పోస్టులు నిర్వాసితులకు ఇవ్వాలి ఉందని, కానీ కేవలం 220 పోస్టులు మాత్రమే నిర్వాసితులకు ఇచ్చి చేతుల దులుపుకుందన్నారు. అయితే నిర్వాసితులకు మరో 91 పోస్టులు రావాల్సి ఉందన్నారు. వాటిని వెంటనే నిర్వాసిత నిరుద్యోగులతో నింపాలని డిమాండ్ చేశారు. అయితే ఐటిఐ బేసిక్‌తో పరీక్షలను నిర్వహించిన అధికారులు మెట్రాలజీ విభాగానికి సంబంధించి 90 పోస్టులను డిప్లమె విద్యార్హత మీద పరీక్షలు నిర్వహించారని, వీటిలో ఒక్క పోస్టు కూడా నిర్వాసితులకు రాలేదన్నారు. అలాగే ఇన్స్‌మెంటేషన్ విభాగంలో నిర్వాసితులకు చెందిన ఒక మహిళలను సైతం ఎంపిక చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం చూస్తే భవిష్యత్ నిర్వాసిత నిరుద్యోగులకు అన్యాయం చేయాలని యాజమాన్యం చూస్తుందని వారు ఆరోపించారు. దీనిపై స్పష్టంమైన ప్రకటన ఈ నెల 17వ తేదీ లోగా యాజమాన్యం చేయక పోతే ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంట్లో భాగంగా పరిపాలన భవనం జనరల్ మేనేజర్ విశాఖరాజ్‌ను కలిసి నిర్వాసిత, కార్మిక సంఘం నాయకులు ఒక వినత పత్రాన్ని అందించడంతో పాటు సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైటి దాస్ , రామిరెడ్డి, ఉమ్మిడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.