నల్గొండ

సంక్షేమ పథకాలతోనే తెలంగాణ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనగల్, నవంబర్ 16: సంక్షేమ పథకాలతో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, అటవీ శాఖ అభివృద్ధి చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా శక్రవారం పొనుగోడు, గుర్రంపల్లి, రాంచంద్రాపురం, లింగాలగూడెం, జీ ఎడవెళ్లి, బచ్చన్నగూడెం, మాత్రేనిగూడెం, బుడమర్లపల్లి తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి చెందుతుందన్నారు. నల్లగొండ నియోజకవర్గంలోనే గత 20 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా, మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉండి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ప్రజలకు మాయమాటలతో ఎన్నికలలో ప్రచారంగా తిరిగి ఓట్లు వేయించుకుని మళ్లీ నాలుగున్నర సంవత్సరాల వరకు ప్రజలకు కనబడకుండా పోయే వ్యక్తికి కాకుండా ఈసారి టీఆర్‌ఎస్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ప్రతి కార్యకర్తకు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు అభివృద్ధి చెందుతుందన్నారు. వికలాంగులకు వృద్ధులకు, వితంతువులకు రెండు వేల నుంది మూడు వేల రూపాయలు ఇచ్చే ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనె్నండుకు పనె్నండు సీట్లు గెలవడం, టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దొంగ రాజకీయాలు, పూటకోమాట మానుకోవాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి సవాలు విసిరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ కరీం పాషా, ఎంపీపీ కొప్పుల కృష్ణయ్య, జిల్లా నాయకులు కటికం సత్తయ్య గౌడ్, బుర్ర సుధాకర్, వంగాల సాహదేవ రెడ్డి, యాదయ్య, సంజీవ, శ్రీను, వెంకన్న, సైదులు, శ్రీ్ధర్ రావు, క్షేత్రయ్య, కృష్ణయ్య తదితరులున్నారు.