కృష్ణ

బోట్ రేసింగ్ ముగింపుతో భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎఫ్1హెచ్2ఓ బోట్ రేసింగ్‌కు సంబంధించి ఆదివారం నిర్వహించే కార్యక్రమాలన రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే ఏర్పాట్లను కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అధికారులతో కలిసి శనివారం పర్యవేక్షించారు. వాస్తవానికి పర్యాటక శాఖ ఓ ప్రైవేట్ సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో తొలి రోజు మీడియా సిబ్బంది తీవ్ర ఇక్కట్లకు గురికాగా ఆఖరి క్షణంలో కలెక్టర్ బీ లక్ష్మీకాంతం జోక్యంతో సమాచార శాఖ అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా కలెక్టర్ పున్నమి ఘాట్ వద్ద ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలపై ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. గత రెండు రోజులుగా జరిగిన కార్యక్రమాలు పట్ల మంచి స్పందన వచ్చిందని ఆదివారం జరిగే కార్యక్రమాలలో పెద్ద ఎత్తున ప్రజానీకం పాల్గొననున్నందున తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఎఫ్1హెచ్2ఓ కార్యక్రమాల్లో భాగంగా కనకదుర్గా ఫ్లైఓవర్ కింద భాగంలో అభివృద్ధి చేసిన పార్క్‌ను ముఖ్యమంత్రి ఆదివారం సాయంత్రం ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. చిన్న పిల్లలు నుండి పెద్దలు వరకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా పార్క్‌ను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఈ పార్క్‌ను ఎఫ్1హెచ్2ఓ పార్క్‌గా నామకరణం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. నేటి సమీక్షలో టూరిజం డైరెక్టర్ హిమాన్షు శుక్లా, డీసీపీ వీ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.