తెలంగాణ

దానం ఓటమి తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: జరగబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ఓటమి ఖాయమని, అక్కడ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన దాసోజు శ్రవణ్ అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ దానం నాగేందర్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని భూ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. నాగేందర్ ఎన్నికోట్లు ఖర్చు చేసినా గెలిచేది తానేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒక డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించిన దానం వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ఆయన నిలదీశారు. ఎవరికో డబ్బులు ఇచ్చి తనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేలా చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం దానంకు పుట్టకతో వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రజలు తనకోసం 15 రోజులు కేటాయించి గెలిపిస్తే తాను ఐదేళ్ళు సేవ చేస్తానన్నారు.