రంగారెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, నవంబర్ 20: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ అభ్యర్ధులు పోటీ చేస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు బడుగు, బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 90 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను పక్కనపెట్టి అతి తక్కువ జనాభా ఉన్న వర్గాలకు అధిక శాతం టికెట్లు కేటాయించారని అన్నారు. 70 ఏళ్లుగా ఆయా వర్గాలకు రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉందని పేర్కొన్నారు. రెబల్స్ తరఫున పోటీ చేయాలనే విషయంపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఏపీలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో డిసెంబర్ 8, 9 తేదీల్లో భీమవరంలో నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

భిక్షపతికి జైపాల్ రెడ్డి భరోసా
గచ్చిబౌలి, నవంబర్ 20: కాంగ్రెస్‌లో భిక్షపతి యాదవ్‌కి సముచిత స్థానం ఉంటుందని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి భరోసా నిచ్చారు. శేరిలింగంపల్లి రెబల్ భిక్షపతి యాదవ్‌ను బుజ్జగించేందుకు అధిష్ఠానం పెద్దగా మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని రంగంలోకి దింపింది. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని చెప్పడానికి వచ్చినట్లు తెలిపారు. క్రమశిక్షణగల నాయకుడు భిక్షపతి యాదవ్‌ని వదులుకోద్దని అధిష్ఠానానికి చెప్పినట్లు జైపాల్ రెడ్డి వివరించారు. మహాకూటమి బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్నారా అని విలేఖరులు ప్రశ్నించగా సీఎం పోటీలో తాను లేనని చెప్పారు.

ఆర్‌ఎఫ్‌ఐడీతో చిల్లర చిక్కులకు చెల్లు
* ట్రాఫిక్ సమస్యకూ పరిష్కారం
ఉప్పల్, నవంబర్ 20: హైదరాబాద్ నగరం చుట్టూ 150 కిలోమీటర్ల పొడవున్న ఔటర్ రింగ్‌రోడ్డుపై పలు చోట్ల టోల్ కలెక్షన్ కేంద్రాల వద్ద చిల్లర సమస్యతో పాటు రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ వల్ల పలు వాహనాదారులకు టోల్‌గేట్ వద్ద వాహనాదారులు బారులు తీరి ఉండాల్సి వస్తోంది.
టోల్ రుసుముల చెల్లింపులలో అవసరమైన చిల్లర నోట్లు లేకపోవడం ఎత్తయితే నిర్ధారిత సమయాలలో పెరుగుతున్న వాహన రాకపోకల సంఖ్య కూడా ముఖ్య కారణమని చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) ఆధారిత టోలు రుసుం చెల్లింపు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) ప్రయోత్మకంగా టెస్టింగ్ పద్ధతిలో అమలు జరుగుతోంది. ఆర్‌ఎఫ్‌ఐడీ ఆధారిత ఎలక్ట్రానిక్ టోలు రుసుం, స్మార్ట్ కార్డు ఆధారిత ఎలక్ట్రానిక్ టోలు రుసుత పద్ధతి, కాగిత రహితమైన వ్యక్తిగత లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ పద్ధతిన 19 ఇంటర్ ఛేంజ్ ఓఆర్‌ఆర్ కలెక్షన్ చెక్‌పోస్టులలో అమలు చేస్తుండటంతో టోలు రుసుం వసూలును మరింత సమర్ధవంతంగా అమలు చేస్తున్నారు. టోలు ప్లాజా వద్ద క్యూ వరుస తగ్గుతూనే వాహన కాలుష్యానికి బ్రేక్ పడుతుంది. అరుదైన అవకాశాన్ని అమలు చేస్తున్న హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. రానున్న రోజుల్లో ఆధునిక టెక్నాలజీతో ప్రయాణీకులకు మరిన్ని సౌకర్యాలను కల్పించనున్నట్లు సంస్థ కమిషనర్ డాక్టర్ బీ.జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.