Others

అహంకారాన్ని విడిచిపెట్టు.. ఆడంబరాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిబాబా తాను దైవమని, భగవంతుడినని చెప్పుకోలేదు. తాను భగవంతునికి వినయ పూర్వకమైన సేవకుడిని మాత్రమేనని పదే పదే చెప్పుకున్నారు. ‘అల్లా మాలిక్’ అనేది బాబా నాలుకపై నిత్యం నాట్యమాటే భగవన్నామ స్మరణ. అల్లా అందరికీ మంచి చేస్తాడని నిత్యం అందరికీ చెబుతుండేవారు. సాయి దర్బారులో పండితులు, పామరులు, ధనవంతులు, బీదలు, అగ్రవర్ణాలు, నిమ్న వర్గాలు అందరూ సమానులే. నానాసాహెబు చాందోర్కర్, కాకాసాహెబు దీక్షిత్, హరివినాయక సాఠే వంటి ప్రముఖులు, సంపన్నులతో పాటే మహల్సాపతి, మాధవరావు దేశ్‌పాండే సామాన్యులు, మరోపక్క భాగోజీ షిందే వంటి కుష్ఠురోగ భక్తులు ఏక కాలంలో బాబాను యథాశక్తి సేవించుకోగలిగారు. బాబా వారందరినీ సమానంగానే చూశారు. మతాల మధ్య వైషమ్యాలను బాబా ఖండించారు. రాముడు, రహీం ఒక్కరేనని, వారి అనుచరులమైన మనం ఘర్షణ పడటం ఎందుకని ఇరు మతాల వారికి హితవు చెప్పారు. తన బోధనల్లో మృదుభాషణ, వినయ శీలానికి పెద్దపీట వేసిన బాబా భక్తజన బాంధవుడు. అందరి ఆత్మలను పరిపాలించే ఆత్మబంధువు. అంతరంగంలో అహాన్ని, బాహ్యంలో ఆడంబరాన్ని విడనాడటమే మనిషి కర్తవ్యం కావాలంటూ మానవ జీవితంలోని మహిత సత్యాలను ఎరుకపర్చిన మహిమాన్వితుడు సాయిభగవానుడు. ‘అహంకారాన్నివిడిచిపెట్టు. ఆడంబరాల జోలికి వెళ్లకు. అందరిలో ఒకడిగా జీవించు. సహనంతో ఉండు. ఓపిక పట్టు అనేదే భాబా తన నిరాడంబర జీవితం ద్వారా భక్తజన కోటికి చాటారు. క్రమశిక్షణ, ప్రేమ, భక్తి, శరణాగతి, నైతిక ప్రవర్తన, భగవంతునిపైనే మనసును లగ్నం చేసి ఉంచటం... ఇవే సాయితత్వంలోని ముఖ్యాంశాలు.
నిష్కామ కర్మే సేవ అని బాబా చాటారు. తన దయను, ప్రేమను, కారుణ్యాన్ని అన్ని జీవులపైనే ఒకే విధంగా చూపారు బాబా. మనలోని అహంకారం, ఆడంబరాల పొరలను ఒక్క క్షణం తొలగించుకుని చూస్తే సాయితత్వం, పరతత్వం అర్థమవుతాయి. వాటిని నిజ జీవితంలో ఆచరిస్తే సేవాభావం, ప్రేమ, దయాగుణాలతో జీవన సౌందర్యం పరిమళిస్తుంది. మనకు బతుకుకు దారిచూపేది, మార్గనిర్దేశనం చేసేది సాయి దివ్యజ్ఞానమే. సాయి లీలల్లోని పరమార్థాన్ని తరచి తరచి చూడాలే కానీ అద్భుతమైన మహిత సత్యాలు కళ్లకుకడతాయి. వాటిలోని నిజమై అర్థాన్ని గ్రహించినపుడు కళ్లుచెమరుస్తాయి. శరీరం సన్నగా వణికి జలదరిస్తుంది. పెదాలు ఆర్తితో ‘సాయి...సాయి’ అనే నామస్మరణం చేయాలని తపిస్తాయి. అహం లేని బాబా శిరిడీ పురవీధుల్లో భిక్షాందేహీ అన్నారు. అదే చేత్తో వందలాది మందికి నిత్యం అన్న సంతర్పణచేశారు. అడిగిమరీ దక్షిణ పుచ్చుకున్న బాబా తాను మాత్రం అడిగినవారికి, అడగని వారికి కూడా వారివారి అవసరాన్ని కనిపెట్టి పంచిపెట్టారు. ఆకారంతో అందరి ఎదుట తిరుగాడిన బాబా నిరాకారంగా వెలుగొందుతూ ఉద్రేకం, అభిమానం లేకుండా ఆత్మలోకంలో స్వేచ్ఛగా విహరించారు. సాయి తన బోధనలు, ఉపదేశాలు, హితోక్తుల ద్వారా భక్తులకు ఆత్మానందాన్ని స్వేచ్ఛ సంతోషాలను పంచిపెట్టారు. బాబాకు మనం ఇచ్చుకోదగినవి ఏమైనా ఉన్నాయంటే అవి శ్రద్ధ(నిష్ఠ), సబూరి (ఓర్పు)లే!.
మనసుల్ని అంతర్ముఖం చేసే సాయితత్వం
హేమాండ్‌పంతు మనకొక కొత్తరకం పూజా విధానాన్ని పరిచయం చేస్తున్నారు. సద్గురువు పాదాలు కడిగేందుకు ఆనందభాష్పాలనే వేడి నీళ్ళను ఉపయోగించెదముగాక! స్వచ్ఛమైన ప్రేమ అనే చందనాన్ని వారి శరీరానికి పూసెదముగాక! దృఢ విశ్వాసమనే వస్త్రంతో వారి శరీరాన్ని కప్పెదముగాక! అష్ట స్వాతికభావాలనే ఎనిమిది తామర పుష్పాలను వారికి సమర్పించెదముగాక, ఏకాగ్రచిత్తమనే ఫలాన్ని సమర్పించెదముగాక. భావమనే బుక్కావారి శిరసుపైన చల్లి భక్తి అనే మొలతాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటన వేళ్ళపై ఉంచెదముగాక. సద్గురువును ఈ విధంగా నగలతో అలంకరించి మన సర్వస్వాన్నీ వారికి సమర్పించెదముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన తరువాత బాబాను ఇలా ప్రార్థించెదముగాక!
‘‘ఓ సారుూ! మా మనస్సును అంతర్ముఖం చేయుము. దానిని లోపలివైపు పోవునట్లుచేయుము. నిత్యానిత్యములకుగల తారతమ్యాన్ని తెలుసుకునే శక్తిని మాకు దయచేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తినిపోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారం కలిగేలా చేయుము. మేము మా శరీరాన్ని, ప్రాణాన్ని సర్వమును నీకు సమర్పించెదము. సుఖఃదుఃఖానుభవాలు కలుగకుండునట్లు మా కళ్లు నీవిగాచేయుము. మా శరీరాన్ని, మనసును నీ స్వాధీనంలోనే ఉంచుకొని నీ ఇష్టానుసారం మమ్మల్ని నడిపించు. ఈ చంచల మనసులు నీ పాదాల చెంత విశ్రాంతి పొందుగాక.’’
పరబ్రహ్మావతారం.. బాబా!
శ్రీ సాయి జీవితం మిక్కిలి పావనమైనది. వారి నిత్యకృత్యాలు ధన్యములు. వారి పద్ధతులు, చర్యలు వర్ణింపనలవికానివి. కొన్ని సమయాల్లో బాబా బ్రహ్మానందంతో మైమరిచేవారు. మరికొన్ని సమయాల్లో ఆత్మజ్ఞానంతో తృప్తిపొందేవారు. ఒక్కొక్కసారి అన్ని పనులనుచేస్తూనే వాటితో ఎటువంటి సంబంధం లేదన్నట్టు ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీచేయనట్టు కనబడినా వారు సోమరిగాకానీ, నిద్రితులుగాకానీ కనిపించేవారు కారు. బాబా ఎల్లప్పుడు ఆత్మానుసంధానం చేసేవారు. బాబా సముద్రం మాదిరిగా శాంతంగా తొణకక ఉండినట్టుకనిపించినా, వారి గాంభీర్యం, లోతు కనుగొన వీలులేనివి. వర్ణనాతీతమైన వారి నైజాన్ని వర్ణింపగలవారెవరు? పురుషులను అన్నదమ్ములవలె, స్ర్తిలను అక్క చెల్లెండ్రవలె, తల్లులవలె చూసేవారు. వారి శాశ్వతాస్థలిత బ్రహ్మచర్యం గురించి అందరికీ తెలిసిందే. వారి సాంగత్యంలో మనకుకలిగిన జ్ఞానం మనం మరణించువరకు నిలుచుగాక! ఎల్లప్పుడు హృదయ పూర్వకమైన భక్తితో వారి పాదాలను కొలిచెదముగాక! సకల జీవకోటిలోనూ బాబాను చూసెదముగాక! వారి నామం ఎల్లప్పుడూ స్మరించెదముగాక!.
*