డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-60

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనుక ఒక్క కుమారుని పొందడానికి ఇవ్వండి స్వీకరిస్తాను. గాలవుడు గుర్రాలను తీసుకొని కన్యను ఇచ్చాడు. రాజు ఆమెతో ఆనందంగా వనాల్లో విహరించాడు. ఆ సమయంలో అతనికి గరుడుడు కన్పించాడు. అతను గాలవుని చూసి ఆగి ఇలా అన్నాడు. ‘‘ద్విజోత్తమా! నీవు ఈ పనిలో కృతకృత్యుడవు అవటం చాలా సంతోషంగా ఉంది. దానికి గాలవుడు ‘‘ఇంకా ఈ కార్యంలో నాల్గవ భాగం మిగిలి ఉంది’’ అన్నాడు.
అప్పుడు గాలవునితో ఇలా చెప్పాడు. ‘‘ఇక నీవు ప్రయత్నం చేసినా ఫలితముండదు. ఒకప్పుడు ఋచీకుడు గాధిరాజు కూతురు సత్యవతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు గాధి ఇలాంటి గుర్రాలనే వేయి గుర్రాలను శుల్కంగా కోరాడు. ఋచీకుడు ఒప్పుకొని వరుణ లోకానికి పోయి అటువంటి గుర్రాలను సంపాదించి గాధి రాజు కిచ్చాడు. ఆయన పుండరీక యాగం చేసి ఆ గుర్రాలను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. వారి దగ్గర నుండి ముగ్గురు రాజులు రెండేసి వందల చొప్పున కొని తమ దగ్గర ఉంచుకున్నారు. మిగిలిన నాలుగు వందల గుర్రాలను తీసుకొని వితస్తానదిని దాటిస్తూ ఉంటే అవి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆ విధంగా ఆరువందల గుర్రాలు మాత్రమే ఉన్నాయి. నీవు ఎంత ప్రయత్నించినా ఇక అలాంటి గుర్రాలు దొరకవు. కనుక మిగిలిన గుర్రాలకు బదులు ఈ కన్యనే విశ్వామిత్రునకు సమర్పించు’’.
గాలవుడు దానికి అంగీకరించి మాధవిని, గుర్రాలను తీసుకొని గరుత్మంతునితోపాటు విశ్వామిత్రుని దగ్గరకు వెళ్లాడు. విశ్వామిత్రునితో ఇలా విన్నవించాడు. ‘‘మహర్షీ! తమరు కోరిన గుర్రాలు ఆరువందలు మాత్రమే దొరికాయి. మిగతా రెండు వందల గుర్రాల బదులు ఈ కన్యను స్వీకరించండి. ఈమె యందు ముగ్గురు రాజర్షులు ముగ్గురు పుత్రులను కన్నారు. అయినా ఈమె కన్యాత్వం చెడలేదు. తమరు కూడా ఒక కుమారుని పొందవచ్చును. ఆ విధంగా నా ఎనిమిది వందల గురుదక్షిణ పూర్తవుతుంది. నేను ఋణవిముక్తుడిని అవుతాను. తర్వాత వెళ్లి తపస్సు చేసుకుంటాను’’.
విశ్వామిత్రుడు ఆ అందమైన కన్యను చూచి గాలవునితో ఇలా అన్నాడు. ‘‘గాలవా! ఈ కన్యను ఇంతకు మునుపే తీసుకొని రావలసింది. ఆ నలుగురు కొడుకులూ నాకే పుట్టేవారు కదా! ఆ గుర్రాలను నా ఆశ్రమంలో విడిచిపెట్టు. నేను ఈ కన్యను స్వీకరిస్తాను’’.
విశ్వామిత్రుడు ఆ కన్యతో సుఖించి ఒక కుమారుని కన్నాడు. ఆ పుత్రుని పేరు అష్టకుడు. పుత్రుని విశ్వామిత్రుడు గుర్రాలతో, జ్ఞానంతో సంపన్నుని చేశాడు. అష్టకుడు విశ్వామిత్రుని రాజధానికి వెళ్లాడు. కన్యను మరల గాలవునికి ఇచ్చి వేసి తాను అడవులకు వెళ్లిపోయాడు. గాలవుడు కన్య వలన తాను గురుదక్షిణ ఇవ్వగలిగినందుకు సంతోషించి ఆమెతో ఇలా అన్నాడు. ‘‘తల్లీ! నీ మొదటి కొడుకు దానపతి, రెండవవాడు శూరుడు, మూడవ కుమారుడు సత్యధర్మ పరాయణుడు. నాల్గవ వాడు యజమాని. ఈ కుమారుల ద్వారా నీవు నీ తండ్రిని కూడా ఉద్ధరించావు. నన్ను ఋణ విముక్తుడను చేశావు’’ ఇలా అని గాలవుడు మాధవిని తండ్రి దగ్గరకు చేర్చి తాను తపస్సు కోసం వనాలకు వెళ్లిపోయాడు. తండ్రి ఆమెకు మరల వివాహం చేయదలిచాడు. కాని మాధవి కూడా తపోవనానికి వెళ్లిపోయి తపోవనానే్న వరునిగా ఎన్నుకొని వనంలో ఒక మృగంలాగ జీవించింది. ఆమె బ్రహ్మచర్యం పాటిస్తూ ధర్మపాలన చేస్తూ జీవించింది.
వృత్రాసురుని కధ
దైత్యులు ఒక్కో యుగంలో ఒక్కో గణం. వారు తమ ధైర్యసాహసాలతో ప్రసిద్ధి చెందారు. సత్యయుగంలో కాలకేయులు అనే దైత్యగణం ప్రసిద్ధి చెందినది. వారు చాలా కౄరులు, దయ లేనివారు. యుద్ధం అంటే ఇష్టం వారికి. వారి నాయకుడు వృత్రాసురుడు. అతడు ఇంద్రుడు మొదలైన దేవతలపై పలుమార్లు దాడి చేశాడు. అతని జన్మకు ఒక ముఖ్య కారణమున్నది.
మహాతపస్వి అయిన త్వష్టప్రజాపతికి ఇంద్రుని మీద కోపం వచ్చి మూడు తలలున్న త్రిశిరుని సృష్టించాడు. అతడు భయంకరమైన రూపుతో ఉన్నాడు. అతడు ఇంద్రపదవి కావాలని తపస్సు చేయసాగాడు. అతను ఒక ముఖంతో వేదాలు చదివాడు. ఇంకొక ముఖంతో సురాపానం చేశాడు. మూడో ముఖంతో దశదిశలను మ్రింగేటట్లు చూస్తూ ఉండేవాడు.
అతను తపస్సునందు, ధర్మమందు దీక్ష వహించి ఇంద్రియ నిగ్రహంతో తీవ్రంగా తపస్సు చేశాడు. అతని తపస్సు చూసి ఇంద్రుడు భయపడ్డాడు. ‘ఇతను ఎలాంటి పరిస్థితిలోనూ ఇంద్రపదవి పొందకూడదు’ అని నిశ్చయించుకొని, అతని మనస్సు తపస్సు నుండి మరల్చడానికి అప్సరసలను పంపించాడు. వారు అతని తపస్సును ఏ విధంగానూ భగ్నం చేయలేక వెనక్కు వచ్చారు. ఇంద్రుడు ఎన్ని అస్త్రాలను అతనిపైకి వదలినా అవి ఏమీ చేయలేకపోయాయి.
అప్పుడు ఇంద్రుడు విశ్వకర్మను పిలిపించి అతన్ని త్రిశిరుని తలలు నరకమన్నాడు. అతనిక అనేక వరాలు ఇస్తానని ఆశపెట్టాడు. విశ్వకర్మ వరాలకి ఆశపడి త్రిశిరుని తల నరికేశాడు. అయితే వేదాధ్యయనం చేసి సోమరసం త్రాగిన ముఖం నుండి కపింజల పక్షులు బయటకు వచ్చాయి. విశ్వకర్మ త్రిశిరుని తల నరికిన విషయం ఎవరికీ చెప్పలేదు.
త్రిశిరుని మరణం గురించి తెలిసిన త్వష్టకు ఆగ్రహం కలిగింది. ‘‘ఏ పాపం చేయని నా కుమారుని ఇంద్రుడు ఎందుకు చంపాడు? ఇంద్రుని నాశనం కోసం ఇంకొకరిని సృష్టిస్తాను’’ అని ఆలోచించి త్వష్ట అగ్నిలో హోమం చేసి ఘోరమైన వృత్రుని సృష్టించాడు. వృత్రుడు అతనికి నమస్కరించి తాను ఏ పనికోసం సృష్టించబడ్డాడని అడిగాడు.
‘‘పోయి ఇంద్రుని వధించు’’ అని త్వష్ట అతనికి ఆదేశించాడు.
అప్పుడు వృత్రునికీ ఇంద్రునికీ ఘోరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వృత్రుడు ఇంద్రుని మ్రింగివేశాడు. దేవతలు వృత్రుని చంపడానికి ఆవులింతను సృష్టించారు. ఆవులించడానికి వృత్రుడు నోరు తెరిస్తే అందులోంచి ఇంద్రుడు బయటపడ్డాడు. మళ్లీ వారిద్దరూ యుద్ధం చేశారు. వృత్రుడు త్వష్ట తేజస్సుతో ఇంకా బలవంతుడు అవుతున్నాడు. ఇంద్రుడు ఓటమిని పొందుతున్నాడు.
దేవతలు వృత్రుని ఎలాగైనా వధించాలని నిశ్చయించుకొని ఇంద్రునితో కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకున్నారు.
అలాంటి జ్ఞానులను నాకు చూపించండి. అయినా నిద్ర రావడమనేది మన చేతుల్లో లేని విషయం. అది వచ్చే సమయంలో వస్తుంది. అంతేకానీ, అది మీరు చెప్పినప్పుడో, నాకు కావలసినప్పుడో రాదు. నిద్ర రాని సమయంలో బలవంతంగా పడుకుని కాలాన్ని వృధా చెయ్యడంకన్నా, ఆ సమయాన్ని సృజనాత్మక కార్యాలకు వినియోగించవచ్చు కదా! కాబట్టి, పాత సిద్ధాంతాలు పాటించమని దయచేసి నన్ను బలవంతపెట్టకండి’ అని నేను మా నాన్నగారితో వాదించాను.
బ్రహ్మ వారితో ఇలా అన్నాడు. ‘‘వృత్రాసురుని చంపడానికి ఒక పద్ధతి ఉంది. దధీచి అనే గొప్ప మహర్షి ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్లి అతని వెనె్నముకను దానమిమ్మని వరంగా కోరండి. అతను అంగీకరించి శరీరాన్ని విడిచి ఎముకలను దానం చేస్తాడు. దానితో వజ్రాయుధం చేయించండి. అది ఆరు అంచులతో ఉంటుంది. ఇంద్రుడు ఆ ఆయుధంతో వృత్రాసురుని చంపగలడు’’.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి