రంగారెడ్డి

పోలింగ్ శాతం తగ్గడానికి ఎన్నికల అధికారుల నిర్లక్ష్యమే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, డిసెంబర్ 8: ఎల్బీనగర్‌లో పోలింగ్ శాతం తగ్గడంతో పాటు కొంత మంది ఓట్లు తొలగించడంలో పూర్తిగా ఎన్నికల అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఎల్బీనగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ రావు ఆరోపించారు. శనివారం ఎల్బీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గత రెండునెలలుగా ఎల్బీనగర్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికీ అన్ని విధాల సహకరించిన బీజేపీ నేతలకు, కార్యకర్తలకు, అనుబంధ సంఘాల నాయకులకు కృతజ్ఞతలు చెప్పారు. ఎల్బీనగర్‌లో ప్రధాన పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు సిద్దాంతాలకు విరుద్ధంగా మద్యం, డబ్బులను పంచి, ఓటర్లను అంగట్లో పశువుల మాదిరిగా కొనుగోలు చేశారని ఆరోపించారు. ఎల్బీనగర్‌లో నివాసం ఉంటున్న ప్రజలకు జిల్లాలలో ఓట్లు ఉన్నందును అక్కడి ప్రాంతంలో ఓట్లు వేయడానికీ పెద్ద ఎత్తున తరలి వెళ్లడంతో ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గిపోయిందని, రెండు చోట్ల ఓట్లు ఉండటానికీ కారకులైన ఎన్నికల సంఘం అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటు వచ్చిన వారికీ ఓటర్ ఐడీ కార్డులను మంజూరు చేశారని, తీర ఓటు వేయడానికీ పోలింగ్ కేంద్రానికీ వెళ్తే నీ ఓటు తొలగించారని చెప్పడంతో ఎంతో మంది ఓటర్లు నిరాశతో వెనుదిరిగారని గుర్తు చేశారు. ఇట్టి సమస్యలకు కారకులైన ఎన్నికల సంఘం అధికారులను తీవ్రంగా శిక్షించాలని చెప్పారు. చైతన్యపూరి డివిజన్‌లోని ఒక ఇంటి నెంబర్‌పై 125 ఓట్లు, మరో ఇంటి నెంబర్‌పై 225 ఓట్లు ఉన్నాయని, ఇంత నిర్లక్ష్యంగా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నారని, ఇట్టి సమస్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేస్తానని శేఖర్‌రావు వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోచంపల్లి గిరిధర్, జక్కిడి మహేందర్ రెడ్డి, చారీ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో పోలింగ్ 76.05 శాతం నమోదు
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 8: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పోలింగ్ శాతం 76.05గా నమోదయ్యింది. అసెంబ్లీ ఎన్నికలకు నిర్వహించిన పోలింగ్‌లో పలుచోట్ల ఈవీఎంల మొరాయింపుతో రాత్రివరకు పోలింగ్ కొనసాగింది. దీంతో పోలింగ్ శాతాన్ని ప్రకటించడంలో కొంతమేరా ఆలస్యమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమరేందర్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని మంచాల,యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం మండలాల్లో మొత్తం 2,57,681 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,95,973 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వివరించారు. గత ఎన్నికలతో పోల్చితే 5 శాతం కొంత మేరా ఓట్లు తగ్గాయని చెప్పారు. నియోజకవర్గంలో గుర్తించి 13 సమస్యాత్మక ప్రాంతాల్లోనూ పోలింగ్ శాతం 70కిపైగా నమోదు కావడం విశేషం. కొంత మంది ఓటర్ల ఓట్లు గల్లంతయ్యాయని ఫిర్యాదులు వచ్చాయని వాటిపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయని పోలింగ్ కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యిందని, ఆలస్యమయిన చోట్లలో పోలింగ్ గడువును గంట పాటు పెంచినట్లు చెప్పారు.