కృష్ణ

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, : బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా పరిషత్ సీఇఓ షేక్ సలామ్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారిని తిరిగి తీరానికి రప్పించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. సాగునీరు, విద్యుత్ సరఫరాలలో అవాంతరాలు ఎదురైతే వెంటనే సరిదిద్దేందుకు సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. చెట్ల కూలితే తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. నిత్యావసరాల సరుకులు శనివారం ఉదయానికి సిద్ధం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే అత్యవసర మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకీట్లు, వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. మంచినీటి ట్యాంకర్లు, జనరేటర్లు అందుబాటులో ఉంచుకుని ప్రతి గ్రామంలో రిస్క్యూ బృందాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే పునరావాస కేంద్రాలకు అనువుగా ఉండే విధంగా పాఠశాలలను, తుఫాన్ షెల్టర్లను ఆయన పరిశీలించారు.

మూతబడ్డ పాలకాయతిప్ప బీచ్ గేట్లు

కోడూరు, : తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పాలకాయతిప్ప బీచ్ గేటుకు తాళాలు పడ్డాయి. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బీచ్‌లోకి సందర్శకులను అనుమతించకుండా బీచ్‌కు వెళ్లే రహదారి ముఖ ద్వారం గేటును మూసి వేశారు. మండల ప్రత్యేక అదికారి, డ్వామా పీడీ పి గురుప్రసాద్ కోడూరు ప్రత్యేక అధికారిగా వచ్చారు. శుక్రవారం ఉదయం 10గంటల సమయంలో పాలకాయతిప్ప బీచ్‌ను సందర్శించిన ఆయన మెరైన్ పోలీసు సిబ్బంది, అంటవి శాఖ సిబ్బంది సహాయంతో బీచ్ గేట్లు మూసి వేసి యాత్రీకులను వెనక్కి పంపించారు. కోడూరు మండల పరిషత్ మీటింగ్ హాలులో వివిధ శాఖల సిబ్బందిని సమావేశ పర్చి తుఫాన్ విపత్తులను ఎదుర్కొవడానికి సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

బంటుమిల్లి, : తుఫాన్ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి, మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్ విక్టర్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో తుఫాన్‌పై సమీక్షించారు. ప్రతి పంచాయతీలో క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. శనివారం నుండి సోమవారం వరకు తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, వీఆర్‌ఓలు, గ్రామ కార్యదర్శులు, వీఆర్‌ఎలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ డివి శేఖరరావు, ఎంపీడీఓ చింతా కళావతి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.