డైలీ సీరియల్

త్రిపురాసుర వృత్తాంతం-104

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మా పట్టణంలో ఒక బావి కావాలి. శస్త్ర ఘాతాలతో మరణించిన దానవులను అందులో వేస్తే వారు పునర్జీవితులు కావాలి’’. ఆ విధంగా బ్రహ్మ వరం పొంది హరి ఆ పురంలో మృతులను బ్రతికించే బావిని సృష్టించాడు. దైత్యుడు ఏ రూపంలో చనిపోతే అతన్ని బావిలో పడవేస్తే ఆ రూపంతో బతికేవాడు. ఈ బావిని పొందిన దైత్యులు ముల్లోకాలను హింసించేవారు. బావి వలన వారికి క్షయం లేదు. వారు అన్ని లోకాలను కొల్లగొట్టసాగారు. దేవతలకు ఇష్టమైన ఉద్యానవనాలు, పవిత్రమైన ఋషుల ఆశ్రమాలు, జానపదాలు నాశనం చేయసాగారు. దేవతలను, పితృదేవతలను, ఋషులను నిలువ నీడలేకుండా చేశారు. ఈ విధంగా అన్ని లోకాలు ఆ దైత్యుల చేత పీడింపబడడం చేత, దేవతలందరూ ఇంద్రునితో కలిసి ఆ మూడు పురాలనీ అన్ని వైపుల నుంచి దాడిచేసి యుద్ధం చేశారు. కాని బ్రహ్మదేవుడి వరాల వల్ల ఆ పురాలను ఛేదించలేకపోయారు. దానితో భయపడి ఇంద్రుడు దేవతలతో కలిసి రాక్షసులు చేసిన అక్రమాలను గురించి చెప్పడానికి బ్రహ్మ దగ్గరకు వెళ్లాడు. వారు జరిగినదంతా పితామహునికి చెప్పి రాక్షసుల వధకు ఉపాయం చెప్పుమని ప్రార్థించారు.
అప్పుడు బ్రహ్మదేవుడు వారితో ఇలా అన్నాడు. ‘‘దేవతలారా! మీకు అపకారం చేసినవాడు నాకూ శత్రువే. దానవులు దుర్మార్గులు. వారు ఎప్పుడూ ఇతరులకు కీడు చేస్తూ ఉంటారు. ధర్మ ద్రోహులను తప్పక సంహరించాలి. కాని ఆ మూడు కోటలను ఒకేబాణంతో కొట్టాలి. అది వారికి నేనిచ్చిన వరమే. పరమేశ్వరుడు తప్ప అలా ఒక్క బాణంతో మూడు పురాలను ఇంకొకడు కొట్టలేడు. ఈశ్వరుడు మహత్కార్యాలను సునాయాసంగా చేయగలడు. ఆ మహాదేవుని మీరు ప్రార్థించండి’’.
అతని మాటలు విన్న దేవతలు, బ్రహ్మను ముందు ఉంచుకుని పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ప్రార్థించారు. తేజోరాశి మూర్త్భీవించిన తపస్వరూపుడు, జ్ఞాన స్వరూపుని వారు దర్శించి స్తుతించారు. దేవతలు, బ్రహ్మర్షులు కూడా అతని ముందు సాష్టాంగ నమస్కారాలు చేశారు. శంకరుడు వారిని ఆశీర్వదించి వారు తన దగ్గరకు వచ్చిన కారణం అడిగాడు. అప్పుడు వారందరు స్వామితో ఇలా అన్నారు ‘‘దేవా! నీవు దేవదేవుడవు. విలుకాడివి. ప్రజాపతుల చేత స్తుతించబడేవాడివి. శుభస్వరూపుడవు, పాపులను రుద్రరూపంలో శిక్షిస్తావు. నినె్నవరూ జయంచలేరు. నిరంతరం తపోరతుడివి; సకల ప్రాణులకు అధిపతివి. సూర్యచంద్రాగ్నులే కన్నులుగా కలవాడివి. నిన్ను శరణు జొచ్చిన మమ్ము త్రిపురాసురుల బారి నుండి కాపాడి రక్షించు. అప్పుడు బ్రహ్మ శివునికి నమస్కరించి ఇలా అన్నాడు. ‘‘మహాదేవా! ప్రజాపతిగా ఉన్న నేను దానవులకు గొప్ప వరం ఇచ్చాను. ఆ వర ప్రభావం వల్ల అహంకరించి క్ష్మిఊకాలను పీడిస్తున్నారు. వాళ్ళను నీవు తప్ప ఇంకొకడు చంపలేడు. దేవా! మమ్ము కాపాడు. దానవులను శిక్షించు.’’
అప్పుడు శంకరుడు వారి ప్రార్థనలకు సంతుష్టుడై వారితో ఇలా అన్నాడు మీ కోసం శత్రువులను వధిస్తాను. కాని ఆ దేవద్వేషులు వర బలంతో ఉన్నారు కనుక నేను ఒక్కడినీ వారిని సంహరించలేను. కనుక మీరంతా కలసి నా సగం తేజస్సుతో పరిపుష్టులయ ఏకమైతే శత్రువులను జయంచగలము’’.
అప్పుడు దేవతలు శివునితో ఇలా అన్నారు - ‘‘దేవా! మా బలం కంటే వారి బలం రెండు రెట్లు అధికం’’ అప్పుడు శంకరుడు వారితో ఇలా అన్నాడు. ‘‘మీకు ఇంత హాని చేసిన వారిని సంహరించ వలసిందే! నా తేజస్సు బలాల అర్థ్భాగంతో వారిని జయంచండి.’’ అప్పుడు దేవతలు ఇలా విన్నవించారు. ‘మహాదేవా! నీ తేజోబలాన్ని మేము భరించలేము. మా అందరి సగం బలంతో నీవే శత్రువులను వధించు.’’ వారి మాటలకు సమ్మతించి శంకరుడు వారితో ఇలా అన్నాడు. ‘నా సగం బలం మీరు భరించలేకపోతే నేనే మీ అందరి సగం బలం స్వీకరించి ఆ దైత్యులను సంహరిస్తాను’’ ఇలా చెప్పి అతను దేవతల సగం బలం గ్రహించి సర్వ దేవతలకన్నా బలవత్తరుడు అయ్యాడు. అతనికి మహాదేవుడు అన్న పేరు సార్థకం అయంది. తర్వాత అతను తన శక్తికి సరిపోయే ధనుస్సు, బాణాలు, రథాన్ని వెతికి తెమ్మని దేవతలను ఆదేశించాడు. అప్పుడు దేవతలు ఇలా చెప్పారు. ‘‘మహాదేవా! మేము మూడు లోకాల తేజస్సులను ఎక్కువగా ఏకం చేసి నీ కోసం ఒక తేజోమయమైన రథాన్ని తయారుచేస్తాము. దానిని విశ్వకర్మ నిర్మిస్తాడు. అలా అని ఆ దేవశ్రేష్ఠులు ఒక చక్కటి రథాన్ని కల్పించారు. విష్ణువును, చంద్రును, అగ్నిని కలిపి బాణంగా తయారు చేశారు. ఆ బాణానికి అగ్రభాగం చంద్రుడు అయ్యాడు. శృంగాకార భాగం అగ్ని అయ్యాడు. పర్వతాలతో, నదులతో ఉన్న భూదేవిని రథం చేశారు. ఆ రథానికి ముందర పర్వతం ఇరుసు అయంది. మహానది అయన గంగ ఇరుసుకు ఆధారమైన కొయ్య అయంది. దిక్కులు, విదిక్కులు రథానికి ఆవరణం అయ్యాయ. కృతయుగం కాడి అయంది. సర్పరాజు వాసుకి కూబరం అయ్యాడు. హిమవంతం రథానికి వెనుక ఉండే కర్ర అయంది. దేవతలు ఉదయాస్తమయ పర్వతాలను ఆ రథ చక్రాలకు ఆధారమైన కర్రగా చేశారు. సముద్రం రథానికి కట్టే త్రాడు అయంది. సప్తర్షి మండలం రథ చక్రాల రక్షణకు ఏర్పరిచే సాధనం అయంది. గంగ, సింధు, సరస్వతి నదులు, ఆకాశం తొట్టెకు ముందు భాగం అయ్యాయ. ఆ రథానికి బంధన సామగ్రి జలమ్మ సర్వ నదులూ అయ్యాయి. గ్రహాలు, నక్షత్రాలు రథానికి రక్షకమయన ఆవరణం అయ్యాయి. ధర్మార్థ కామాలను కలిపి రథంలోని ఆసనం చేశారు సూర్యచంద్రులు, హిమవద్వింధ్య పర్వతాలు రథానికి గల చక్రాలు అయనాయ. పదిమంది సర్పరాజులను ఈషాదండంలో భాగం చేశారు. ఇంకా పెద్ద సర్పాలను గుర్రాలను కట్టే త్రాళ్ళను చేశారు. కాల పృష్ఠం, నహుషుడు, కర్కోటకుడు, ధనంజఋడు ఇంకా తక్కిన సర్పాలను గుర్రాల జూలును కట్టే త్రాళ్ళను చేశారు. ఇంద్ర, వరుణ, యమ, కుబేరులు ఆ రథానికి గుర్రాలు అయ్యారు. సినీ వాలి, కుహువు, అనుమతి సువ్రత అనే దేవతలను గుర్రాలకు పగ్గాలను చేశారు. ధర్మం, సత్యం, తపస్సులను కళ్ళేలను చేశారు. రథానికి ఆధారభూమి మనస్సు అయంది. సరస్వతీ దేవి రదమార్గమయంది. గాయత్రి రథం పైభాగాన కట్టే త్రాడు అయంది. పూర్వం పరమేశ్వరుని యజ్ఞంలో నిర్మితమైన సంవత్సరం ధనుస్సు, సావిత్రి అల్లెత్రాడు అయ్యారు. మేరు పర్వతం జెండా కర్ర, మేఘాలు మెరుపులతో కలిసి పతాకాలు అయ్యాయి. సమస్త లోకతేజంతో నిర్మితమైన ఆ రథాన్ని చూసి దేవతలు సంతోషించి తమకు విజయం తద్యమని భావించారు. రదం సిద్ధంగా ఉందని వారు శంకరునికి నివేదించారు. అతను తన ఆయుధాలను రథంలో ఉంచాడు. ధ్వజాన్ని ఆకాశంలోకి ఎగురవేసి దానిపై తన వాహనం అయన నందిని ఉంచాడు. అధర్వంగీరసులు శివునికి చక్రరక్షకులయ్యారు. ఋగ్వేదం, సామవేదం, పురాణాలు ముందుండి రథం శోభను పెంచాయి. యజుర్వేదం, ఇతిహాసాలు వెనుకభాగాన్ని రక్షించేవి అయ్యాయి. ఓంకారం అగ్రభాగాన ఉండి శోభించింది. ఆరు ఋతువులతో కూడిన సంవత్సర కాలాన్ని ఒక విచిత్రమైన ధనుస్సును చేసి, శంకరుడు తన నీడనే అల్లె త్రాటిని చేశాడు. విష్ణువు అగ్ని చంద్రుడు కలిసి బాణ రూపం దాల్చారు. రుద్రుడు కాల స్వరూపుడు కనుక అతనికి సంవత్సరం ధనుస్సు అయంది.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి