క్రీడాభూమి

56 వనే్డలు..100 వికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపియర్, జనవరి 23: టీమిండియా పేసర్, 28 ఏళ్ల మహమ్మద్ షమీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 6 ఓవర్లలో 19 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో వనే్డల్లో వేగంగా 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా షమీ రికార్డు పుటల్లో చోటుదక్కించుకున్నాడు. కివీస్‌తో జరిగిన 50 ఓవర్ల మ్యాచ్ షమీకి 56వది కావడం గమనార్హం. కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రోత్సాహం, జట్టు మేనేజిమెంట్ మద్దతు వల్లే తాను ఈ ఘతను సాధించగలిగానని షమీ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నాడు. షమీ వనే్డ కెరీర్‌లో 100వ వికెట్ న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గుప్తిల్‌ది కావడం విశేషం. తొలి వనే్డలో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న షమీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. మహమ్మద్ షమీ తర్వాత భారత బౌలర్లలో జహీర్ ఖాన్ (59 వనే్డలు), అజిత్ ఆగార్కర్ (67 వనే్డలు), జవగళ్ శ్రీనాథ్ (68 వనే్డలు) 100 వికెట్లు సాధించారు.
షమీపై కోహ్లీ పొగడ్తల వర్షం
వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో త్వరితగతిన 100 వికెట్లు తీసిన భారత తొలి బౌలర్‌గా ఘనత వహించిన పేసర్ మహమ్మద్ షమీపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పొగడ్తల వర్షం కురిపించాడు. గత ఏడాది యోయో ఫిట్నెస్ కారణంగా జట్టుకు దూరంగా ఉండడంతోపాటు కుటుంబ వ్యవహారాలు కొంత ఇబ్బంది కలుగజేసినా అన్నింటినీ తట్టుకుని ఆటపై ఉన్న అంకితభావం, శ్రద్ధతో త్వరితగతిన పూర్తి ఫిట్నెస్ సాధించడం గొప్ప విషయమని అన్నాడు. ఇంతకు మునుపెన్నడూ లేనంత దారుఢ్యంతో షమీ కనిపిస్తున్నాడని అన్నాడు.