అంతర్జాతీయం

‘కృత్రిమ మేధ’పై నియమాలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 24: వ్యక్తిగత గోప్యత అన్నది మానవహక్కుగా ఉంటున్న నేపథ్యంలో ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏ 1)ను మనం పూర్తి స్థాయిలో ఉపకరించే ముందు దానికి కొన్ని నియమాలను ఏర్పర్చుకోవాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్ల చెప్పారు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన చర్యలు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రపంచం ఇప్పుడు సాంకేతిక బాటలో నడుస్తోందని, ప్రతి హెల్త్, రిటైల్ కంపెనీ డేటా గురించి ఆలోచించాలని అన్నారు. ప్రైవసీని మనం మానవహక్కుగా భావిస్తామని, అయితే కొనుగోలుదారుడే మనదగ్గర ఉన్న డేటాకు యజమానిగా భావించాలన్న కోర్ సూత్రాన్ని మనం అనుసరించాల్సిన అవసరం ఏర్పడిందని, కేవలం సాంకేతిక సెక్టారే కాదు మొత్తం ఆర్థిక వ్యవస్థకు సైతం ఇది వర్తిస్తుందని అన్నారు. జనరల్ డేటా ప్రొటక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) గురించి ఆయన మాట్లాడుతూ తన అభిప్రాయం ప్రకారం ప్రైవసీ అన్నది మానవహక్కు అనే అంశానికి ఇది అద్భుతమైన ప్రారంభమని పేర్కొన్నారు. అమెరికాలో తాము ఇదే ధోరణిని కొంతమేర పాటిస్తున్నామని, మిగతా ప్రపంచం సైతం ఇదే బాటలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆల్గరిథమ్స్, మెషిన్ లెర్నింగ్ గురించి ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధ (ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్) సృష్టికర్తలుగా దీనికి కొన్ని సూత్రాలను ఉపకరించాల్సి ఉందని అన్నారు. సురక్షిత విధానానికి తోడ్పడేలా మైక్రోసాఫ్ట్ ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేయాల్సి ఉందని అన్నారు. ఇదే ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్‌కు సైతం వర్తిస్తుందని, అయితే బ్లాక్‌బాక్స్‌తో ప్రధానమైన చిక్కు వస్తోందని అన్నారు. మనం మిషన్‌కు అందించే వివరాలను అందించడమే కాక, దానిని నియంత్రించాల్సిన బాధ్యత కూడా మనుషులదేనని, అయితే మనం అందించే డేటా ద్వారా మిషన్ అందించే అవుట్‌పుట్, తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి నమ్మశక్యంకాని విధంగా, ఆశ్చర్యపరిచేదిగా ఉంటోందని ఆయన అన్నారు. అభివృద్ధి చెందిన సమాజం కావాలంటే వృద్ధి చెందిన సాంకేతికత అవసరమని, మైక్రోసాఫ్ట్ కాని మరెవరైనా కాని సంవిధాన్ని పాటించాలని, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, హార్డ్‌వేర్ ఇంజనీర్లు, డిజైనర్లు, డేటా సైంటిస్టులు, ప్రొడక్ట్ మేనేజర్లు ఇలా ప్రతిఒక్కరికీ ఆధునిక సమాజాన్ని సృష్టించడానికి స్టెమ్ సైన్స్, సోషల్ సైన్స్ చాలా అవసరమని సత్యనాదెళ్ల అభిప్రాయపడ్డారు. రానున్న వందేళ్లలో భారత్ మరింత సూపర్‌పవర్‌గా మారుతుందని, దానికి కావాల్సిన శక్తి, సామర్థ్యాలు మనకున్నాయని అన్నారు.