తెలంగాణ

నష్టపోయిన రైతులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: అకాల వర్షాలతో తెలంగాణలో పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేని అకాల వర్షాలు కురుస్తున్నందున చేతికి వచ్చిన పంట దెబ్బతిన్నదని, దీంతో రైతాంగం తీవ్ర నష్టాన్ని చవిచూసిందని, వీరిని తక్షణమే ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, వేరుశనగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వేరుశనగ పంటకు మొలుకలు వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. మరో వైపు మామిడి పూత రాలిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టపరిహారాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను క్షేత్ర స్థాయికి పంపాలని ఆయన సూచించారు. నష్టపోయిన పంటకు ఎకరాకు రూ.20వేల పరిహారం చెల్లాంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.