క్రీడాభూమి

తిరుగులేని భారత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమిండియా మరోసారి తమకు తిరుగులేదని చాటింది. మొన్న
ఆ స్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే టెస్టు, వనే్డ సిరీస్‌లలో ఓడించిన కోహ్లీ సేన.. ఇప్పుడు న్యూజిలాండ్‌నూ మట్టికరిపించింది. ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు
మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది.
*
వౌంట్ మాంగనూయ్, జనవరి 28: న్యూజిలాండ్- భారత్ మధ్య సోమవారం జరిగిన మూడే వనే్డలో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మంచి ఫాంలో భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ రెండో ఓవర్‌లోనే కొలిన్ మున్రో (7) వికెట్‌ను తీసి భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు. ఆ తర్వాత కెప్టెన్ విలియమ్సన్ క్రీజులోకి వచ్చి మరో ఓపెనర్ మార్టిన్ గప్తిల్ జతకట్టి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో గప్తిల్ (13) షమీ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో క్రీజులోకి వచ్చిన సీనియర్ ఆల్‌రౌండర్ రాస్ టేలర్ కెప్టెన్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి 33 పరుగుల విలువైను భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని యుజేంద్ర చాహల్ విడదీశాడు. 16వ ఓవర్ వేసిన చాహల్ రెండో బంతికే విలియమ్సన్ (28) ఇచ్చిన క్యాచ్‌ను హార్దిక్ పాండ్య అద్భుతంగా పట్టుకున్నాడు. అప్పటికీ న్యూజిలాండ్ స్కోరు మూడు వికెట్లకు 59 పరుగులు మాత్రమే. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన టామ్ లాథమ్ టేలర్‌తో కలిసి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ తరుణంలో రాస్ టేలర్ అర్ధ సెంచరీ సాధించాడు. లాథమ్ (51) కూడా అర్ధ సెంచరీ సాధించి చాహల్ బౌలింగ్‌లో అంబటి రాయుడుకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన హెన్రీ నికోలస్ (6), మిచెల్ సాంత్నార్ (3)ను పాండ్య వెంటవెంటనే పెవిలియన్‌కు పంపాడు. మరోవైపు దూకుడు మీదున్న టేలర్ (93) సెంచరీకి చేరువగా వచ్చి షమీ బౌలింగ్‌లో కీపర్ దినేష్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చిఅవుటయ్యాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు డౌగ్ బ్రాస్‌వెల్ (15)ను కోహ్లీ రనౌట్ చేయగా, ఇష్ సోదీ (12)ని షమీ, ట్రెంట్ బౌల్ట్ (2) భువనేశ్వర్ పెవిలియన్‌కు పంపడంతో కివీస్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 243 పరుగులకు ఆలౌటైంది. చివరి ఐదు వికెట్లను న్యూజిలాండ్ 23 పరుగులకే కోల్పోయంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్య రెండేసి వికెట్లు తీసుకున్నారు.
రోహిత్ మళ్లీ..
244 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు భారత ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినా, మరో ఎండ్ శిఖర్ ధావన్ దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
అయతే 8.2 ఓవర్ వద్ద ధావన్ (28) బౌల్ట్ బౌలింగ్‌లో రాస్ టేలర్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చి రాగానే దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ (62) 63 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడినా సాంత్నార్ బౌలింగ్‌లో స్టాంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు కోహ్లీ (60) అంబటి రాయుడితో కలిసి జట్టు స్కోరును 150 దాటించాడు. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీ సాధించి, బౌల్ట్ బౌలింగ్‌లో నికోలస్ పట్టిన క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరాడు ధోనీ స్థానంలో మూడో వనే్డ ఆడుతున్న దినేష్ కార్తీక్ (38), అంబటి రాయుడు (40) కలిసి జట్టును 43వ ఓవర్‌లోనే గెలిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా, మిచెల్ సాంత్నార్‌కు ఒక వికెట్ దక్కింది. కాగా ఐదు వనే్డల సిరీస్‌ను భారత్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే గెలుచుకుంది. నాలుగో వనే్డ గురువారం జరగనుంది.
స్కోర్ బోర్డు..
న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్ (సీ) కార్తీక్ (బీ) భువనేశ్వర్ 13; కొలిన్ మున్రో (సీ) రోహిత్ (బీ) షమీ 7; కేన్ విలియమ్సన్ (సీ) హార్దిక్ పాండ్య (బీ) చాహల్ 28; రాస్ టేలర్ (సీ) కార్తీక్ (బీ) షమీ 93; టామ్ లాథమ్ (సీ) రాయుడు (బీ) చాహల్ 51; హెన్రీ నికోలస్ (సీ) కార్తీక్ (బీ) హార్దిక్ పాండ్య 6; మిచెల్ సాంత్నార్ (సీ) కార్తీక్ (బీ) హార్దిక్‌పాండ్య 3; డౌగ్ బ్రాస్‌వెల్ (రనౌట్, కోహ్లీ) 15; ఇష్ సోదీ (సీ) కోహ్లీ (బీ) షమీ 12; ట్రెంట్ బౌల్ట్ (సీ) షమీ (బీ) భువనేశ్వర్ 2; లాకీ ఫెర్గూసన్ (నాటౌట్)2. ఎక్స్‌ట్రాలు: 11
మొత్తం: 243 (49 ఓవర్లలో ఆలౌట్)
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 10-1-46-2. మహమ్మద్ షమీ 9-0-41-3, యుజ్వేంద్ర చాహల్ 9-0-51-2, హార్దిక్ పాండ్య 10-0-45-2, కుల్దీప్ యాదవ్ 8-0-39-0, కేదార్ జాదవ్ 3-0-17-0.
భారత్: రోహిత్ శర్మ (స్టాంప్,లాథమ్) (బీ) సాంత్నార్ 62; శిఖర్ ధావన్ (సీ) రాస్ టేలర్ (బీ) బౌల్ట్ 28; విరాట్ కోహ్లీ (సీ) హెన్రీ నికోలస్ (సీ) బౌల్ట్ 60; అంబటి రాయుడు 40 (నాటౌట్); దినేష్ కార్తీక్ 38 (నాటౌట్). ఎక్స్‌ట్రాలు: 17
మొత్తం: 245 (43 ఓవర్లలో.. మూడు వికెట్ల నష్టానికి)
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 10-1-40-2, డౌగ్ బ్రాస్‌వెల్ 6-0-49-0, లాకీ ఫెర్గూసన్ 10-1-57-0, మిచెల్ సాంత్నార్ 10-0-45-1, ఇష్ సోదీ 7-0-53-0.
చిత్రం.. రోహిత్ శర్మ (62)