తెలంగాణ

ఇష్టపడి చదివితే ఉన్నతస్థాయి తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, ఫిబ్రవరి 1: విద్యార్థులు ఇష్టపడి చదివితే ఉన్నతస్థాయిలో నిలువవచ్చని కలెక్టర్ భారతీ హోళీకేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వళన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విజయానికి చిరునామాగా మారిందన్నా రు. పేద,మధ్య తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం రెసిడెన్సీయల్ గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. అవకాశాలు అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. మార్కుల కోసం కాకుండా జ్ఞానాన్ని పెంచుకునేలా చదవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలని, అర్హత కలిగి ఓటు హక్కు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షీయల్ ఎడ్యూకేషనల్ ఇనిస్ట్రూషన్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్నాయని ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ స్థిర పడుతున్నారని అన్నారు. అనంతరం కళాశాలలో చదువుతూ వివిధ జిల్లా రాష్ట్ర, జాతీయ స్థాయిలో సంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, చదువు, వ్యాస రచన, ఉపన్యాస పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సీల్డ్‌లు అందజేశారు. అనంతరం విద్యార్థినీలు ప్రదర్శించిన నృత్యాలు అందరిని అకట్టుకున్నారు. ఇందులో భాగంగా కలెక్టర్ హోళీ కేరి విద్యార్థినులతో కలిసి క్యాట్‌వాక్ చేయ డం అందరినీ అలరించింది. కార్యక్రమం లో జిల్లా ఖజానా అధికారి సరోజ, జిల్లా కన్వీనర్ చంద్రమోహన్ గౌడ్, జిల్లా కళాశా ల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.