తెలంగాణ
కూతురు పుట్టలేదని మగశిశువును చంపేసింది..!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 6 April 2016
హైదరాబాద్: నగరంలోని నేరేడ్మెట్ వద్ద మంగళవారం రాత్రి చైన్స్నాచర్ల దాడిలో పసికందు మరణించినట్లు వచ్చిన వార్తల్లో నిజానిజాలను పోలీసులు నిగ్గుతేల్చారు. కన్నతల్లే 25 రోజుల మగశిశువును కడతేర్చిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. చైన్స్నాచర్లతో జరిగిన పెనుగులాటలో తలకు గాయమై మగశిశువు మరణించినట్లు తల్లి పూర్ణిమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆమె చెప్పిన విషయాలపై అనుమానం కలగడంతో పోలీసులు లోతుగా విచారించారు. మగబిడ్డను తానే చంపేసినట్లు ఆమె పోలీసుల విచారణలో అంగీకరించింది. ఆమెకు వరుసగా ముగ్గురూ మగపిల్లలే పుట్టారు. ఆడపిల్ల పుట్టడం లేదన్న అసంతృప్తితో మగశిశువును చంపేసిందని పోలీసులు తెలిపారు.