తెలంగాణ

ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకొత్తపల్లి, ఫిబ్రవరి 14: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామంలోని నంది కోటీశ్వరాయలంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయంలోని శివలింగాన్ని పెకిలించి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. దేవాలయంలో ఉన్న విగ్రహాలన్నీంటికీ దారాలతో బంధనం చేసి విగ్రహాల కళ్లకు మైనం పెట్టి క్షుద్రపూజలు నిర్వహించి దేవాలయం చుట్టూ పసుపు, కుంకుమ, దేవాలయంలో కారం పొడి చల్లి తవ్వకాలు జరిపారు. గురువారం తెల్లవారుఝామున శివమాల ధరించి దీక్ష చేస్తున్న శివస్వాములు దేవాలయంలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు దేవాలయంకు వెళ్లారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు గుర్తించిన వారు కల్వకోలు గ్రామానికి వెళ్లి సంఘటన గురించి గ్రామస్తులకు చెప్పడంతో గ్రామానికి చెందిన పెద్దమనుషులంతా కూడా దేవాలయంకు చేరుకొని పరిశీలించారు. శివస్వాములు కుమార, శివ, రవికుమార్, రాజు, నరేష్ సమక్షంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటన గురించి వివరిస్తూ బస్టాండ్‌లో రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. సంఘటన స్థలానికి నాగర్‌కర్నూల్ డీఎస్పీ లక్ష్మీనారయణ, ఎస్సైలు నరేష్, పోచయ్యలు, తహశీల్దార్ దానయ్య చేరుకొని పరిశీలించారు. నాగర్‌కర్నూల్ నుంచి డాగ్‌స్క్వాడ్ , క్లూస్ టీంలను రప్పించి పరిశీలించారు. ఆలయ కమిటీ సభ్యులు మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఈ ఆలయంలో ఇది వరకు ఐదుమార్లు గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్థులు ఆరోపించారు.
ఇప్పటికైనా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొని బాధ్యులైన వారిని గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఇలాంటి ఘటనలు జరుగుతునే ఉంటాయన్నారు. ఇకమీదటనైన పోలీసులు గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
చిత్రం.. తనిఖీలు చేస్తున్న డాగ్‌స్క్వాడ్