తెలంగాణ

ఒకరికి బదులు పరీక్షకు ఇంకొకరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: ఒకరికి బదులు మరొకరు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తుండగా దొరికిపోయారు. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డుకార్యదర్శి డాక్టర్ ఏ అశోక్ వెల్లడిస్తూ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ(షేక్‌పేట)లో ఒక విద్యార్థికి బదులు మరో విద్యార్థి పరీక్ష రాస్తుండగా దొరికిపోయాడని అన్నారు.అలాగే సైదాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒక విద్యార్థికి బదులు మరో విద్యార్థి పరీక్ష రాస్తూ దొరికిపోయాడని బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. శనివారం నాడు ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షల్లో 4,27,043 మంది రిజిస్టర్ చేసుకోగా, అందులో 4,09, 143 మంది హాజరవుతున్నారని, 17,900 మంది గైర్హాజరయ్యారని అన్నారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నందుకు కరీంనగర్‌లో ఒకరు, జగిత్యాలలో ఒకరు, కామారెడ్డిలో ఇద్దరు, నల్గొండలో ఐదుగురు, యాదగిరిలో ఒకరు, నాగర్‌కర్నూలులో ఒకరు, మహబూబ్‌నగర్‌లో ముగ్గురు, వికారాబాద్‌లో నలుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదుచేశామని అన్నారు. ఈ ఘటనలు మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్టు ఆయన చెప్పారు.