తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమ పద్ధతుల్లో గెలవాలని టీఆర్‌ఎస్ యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమ పద్ధతుల్లో గెలుపొందాలని టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తున్నదని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్ అక్రమ పద్ధతులు అవలంభించకపోతే తమ పార్టీ విజయం ఖాయమని ఆయన అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా (డీసీసీ) అధ్యక్షునిగా పార్టీ నాయకుడు చల్లా నర్సింహారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ ప్రసంగిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో గూడూరు నారాయణ రెడ్డి, పట్ట్భద్రుల కోటాలో మాజీ మంత్రి టీ. జీవన్‌రెడ్డి పోటీ చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కోటాలో అక్రమ పద్ధతుల్లో గెలుపొందాలని టీఆర్‌ఎస్ ప్రయత్నించకపోతే తమ పార్టీ అభ్యర్థి తప్పకుండా విజయం సాధిస్తారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కాంక్ష కాంగ్రెస్‌కే ఉందన్నారు. త్వరలో ఎమ్మెల్యే నియోజకవర్గాల వారీగా లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.