డైలీ సీరియల్

భక్తులను కాపాడే సుదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ దుర్వాసమహాముని జటాజూటం నుంచి వెలువడిన కృత్య భయంకరంగా శూలాన్ని ధరించి అంబరీషుని తెగటార్చడానికి బయలుదేరింది.
ఇది బాగానే ఉంది. కానీ పూర్వంలో అంబరీషుడు చేసిన విష్ణ్భుక్తిని మెచ్చుకున్న వైకుంఠనాథుడు ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగినపుడు అంబరీషుడు తన్ను సదా నీ సుదర్శన చక్రంతో రక్షిస్తూ ఉండమని వేడుకున్నాడుకదా.
దాని వల్ల దుర్వాసమహాముని కోపాగ్ని జ్వాలల్లో ఆహుతి అవుతాడేమోనని వెనువెంటనే మహావిష్ణువు సుదర్శనచక్రం మహాప్రభువు ఆనతి గైకొంది. ఇక సుదర్శన చక్రం నిప్పు రవ్వలు చిమ్ముతూ దుర్వాసమహాముని వదిలిన కృత్యపైకి దూసుకు వెళ్లడానికి బయలుదేరింది. ఈ దుర్వాసుడు వదిలిన కృత్యను నాశనం చేయడానికి ఆ కృత్యను ఎదురుగా సుదర్శన చక్రం నడిచింది. సుదర్శన చక్రం ప్రళయాగ్ని వలె విరుచుకుని వచ్చి కృత్యను కాల్చివేసింది. అంతటితో ఊరుకోక దుర్వాసుని వెంబడించింది.
సుదర్శన చక్రాన్ని చూసిన దుర్వాసుడు అమితమైన భయం పొందాడు. తన్ను వెంబడించే సుదర్శన చక్రాన్ని తప్పించుకోవాలని పరుగెత్తి పరుగెత్తి ముల్లోకాలు తిరిగాడు. ఎవరు దుర్వాసుని రక్షించలేకపోయారు. చివరకు కైలాస నాథుడైన శివుడిని శరణుపొందాడు. ప్రళయకాల స్వరూపుడైన శివుడుకూడా సుదర్శన చక్రాన్ని అదుపు చేయలేను నీవు ఆ వైకుంఠ వాసుడినే వేడుకొనమని సలహా ఇచ్చాడు. తిరిగి తిరిగి విష్ణ్ధుమానికి వెళ్లాడు. అక్కడ శేషశాయిపై పవళించిన మహావిష్ణువును సుదర్శనం నుంచి తప్పించమని వేడుకున్నాడు.
మహావిష్ణువు తాను భక్తులకు అధీనంలో ఉంటానని, భక్తులకు ఎవరు ఎగ్గుపెట్టినా వారిని శిక్షించక మాననని చెప్పాడు. తన భక్తులేది కోరుకుంటే దాన్ని నేను వారిపై ఉన్న అవాజ్యమైన ప్రేమతో చేస్తానే కాని వారికి అపాయాన్ని తలపెడితే ఊరుకోనని చెప్పడమే కాక నిన్ను నీవు రక్షించుకోవాలంటే వెళ్లి ఆ అంబరీషునే వేడుకొనుము. ఆ అంబరీషుడు దయతలచి ఆ సుదర్శనానికి నిన్ను సంహరించవద్దు అని చెప్పితే అపుడు ఆ సుదర్శనం నన్ను చేరుతుంది కాని అప్పటివరకు ఈ సుదర్శనం నిన్ను వెంబడించడం మానదు అని చెప్పాడు.
భక్తుల విలువ తెలుసుకొన్న మహాముని తన తప్పిదాన్ని తెలుసుకొని అంబరీషుని గొప్పదనాన్ని కూడా అర్థం చేసుకొన్నాడు. వెంటనే అంబరీషుని దగ్గరకువెళ్లి తన అజ్ఞానాన్ని మన్నించి తన్ను రక్షించమని వేడుకొన్నాడు.
అంబరీషుడు మిమ్ములనైనా, నన్నైనా అసలీ ఈలోకాలన్నింటినీ రక్షించేది ఆ సర్వేశ్వరుడైన పరమాత్మనే కదా. ఆ మహావిష్ణువునే శరణువేడుదాం. ఆయనే సర్వులనూ రక్షిస్తాడు అని దుర్వాసునికి అభయం ఇచ్చి సుదర్శనానికి సుత్తించి దుర్వాసుని క్షమించమని వేడుకొని ఆ నారాయణు ని భజన చేశాడు. వెంటనే సుదర్శన చక్రం వెనుకకు మరలి విష్ణువు చెంతకు చేరింది. అపుడు అక్కడికి మహావిష్ణువు వచ్చి దుర్వాసుడిని, అంబరీషుని దీవించాడు. విష్ణ్భుక్తుడైన అంబరీషుని కథను చదివిని వారికి విన్నవారికి కూడా విష్ణ్భుక్తి అంకురించడమే కాక వారికి ఆ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804