తెలంగాణ

గురుకుల విద్యార్థినులకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, మార్చి 26: గురుకుల విద్యార్థినులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. మెదక్ జిల్లా హవేళీఘణాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బిసి బాలికల గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే. మంగళవారం సాయంత్రం మరోసారి 46 మంది విద్యార్థినులు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండగా వారిని మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థినులు కడుపు నొప్పి భరించలేక తీవ్రంగా రోధించారు. ఈ నెల 25న సుమారు 30 మంది విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడగా ఆసుపత్రికి తరలించగా ఆరుగురిని అడ్మిట్ చేసుకుని వైద్యం అందించిన విషయం తెల్సిందే. కలెక్టర్ ధర్మారెడ్డి సోమవారం రాత్రి గురుకులం సందర్శించిన మరోసారి ఇలా జరగరాదని ప్రిన్సిపాల్‌ను హెచ్చరించారు.
మంగళవారం విద్యార్థినులకు ఉదయం టమాట, మధ్యాహ్నాం దొండకాయతో భోజనం వడ్డించారు. సాయంత్రం నాలుగున్నర గంటల తర్వాత కడుపునొప్పి పెడుతున్నట్లు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లగా వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన జాయింట్ కలెక్టర్ నగేశ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్‌రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ పి.చంద్రశేఖర్, జిల్లా బిసి సంక్షేమ అధికారి సుధాకర్‌లు అక్కడికి చేరుకున్నారు. అందుబాటులో ఉన్న వైద్యులను పిలిపించి వైద్యం చేయించారు. స్థానిక ఎంపిటిసి శ్రీకాంత్, విద్యార్థి సంఘ నాయకులు వినోద్ తదితరులు గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న సరుకులపై ఆరోపించారు.
మెరుగైన వైద్యం చేయిస్తాం: జేసీ నగేశ్
గురుకుల పాఠశాల విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించనున్నట్లు జాయింట్ కలెక్టర్ నగేశ్ తెలిపారు. భోజనం, నీటిని పరీక్ష చేయిస్తామన్నారు. డాక్టర్‌లను అందుబాటులో ఉంచి వైద్యం అందించేలా జిల్లా వైద్యాధికారులకు సూచించారు. వెంటనే నీటి నాణ్యత పరిశీలించి రిపోర్టు ఇవ్వాల్సిందిగా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. మూడు రోజులపాటు విద్యార్థినులకు సెలవుపై పంపించనున్నట్లు చెప్పారు. అస్వస్థతపై పూర్తిస్థాయిలో విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మెదక్ పట్టణం, సమీప ప్రాంతాల్లో నీటి శుద్ది ప్లాంట్‌లను తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
* విద్యార్థినుల రోధనలు
తీవ్ర కడుపు నొప్పితో అస్వస్థతకు గురైన విద్యార్థినులు ఏడవడంతో ఆసుపత్రి గొల్లుమంది. తీవ్ర ఎండ ప్రభావం కారణంగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో విద్యార్థులు అస్వస్థతకు గురై పెద్దయెత్తున రావడంతో ఒక్కసారిగా ఆసుపత్రికి తరలిరావడం, రోగులుండడంతో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. గత రెండు రోజులుగా విద్యార్థినులు అస్వస్థతకు గురవుతున్నా వారి తల్లిదండ్రులకు మాత్రం ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. ఆసుపత్రిలో వైద్యం అందించే సమయంలో అక్కడికి వచ్చిన వారి నుండి సెల్‌ఫోన్ తీసుకుని తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు.