సబ్ ఫీచర్

విశ్వాన్ని జయంచే మంత్రం( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా దగ్గరకు వచ్చిన వారందరూ ‘‘నన్ను ప్రేమించట్లేదు’’అన్నవారే కాని, ‘‘నేను ప్రేమించట్లేదు’’అన్నవారు వారిలో ఒక్కరూ లేరు. నిజానికి, ప్రేమ చాలా అందమైనది. అది ఎప్పుడూ ఆనందానే్న ఇస్తుంది. కాబట్టి, మీరు ఇతరుల ప్రేమ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండండి. అప్పుడు మీకు ఆనందం తప్పకుండా దక్కుతుంది. నిజానికి, మీరు ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువగా, ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత తక్కువగా ప్రేమించబడతారు. కానీ, మీరు తక్కువగా ప్రేమిస్తూ ఎక్కువ ప్రేమను ఆశిస్తేమాత్రం మరింత తక్కువగా ప్రేమించబడతారు. అలా తక్కువ ప్రేమలో మరింత మూసుకుపోయిన మీరు మీ అహానికే పరిమితమై ఎప్పుడూ మండిపడుతూ ఉంటారు.
ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేందుకు ఎవరైనా ముందుకు వచ్చినా, వారిని చూసి మీరు భయపడతారు. ఎందుకంటే, ప్రేమలో ఎప్పుడూ తిరస్కారాలు, ఉపసంహరణలు ఉండే అవకాశముంటుంది. అందువల్ల ‘‘నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు? నా మనసు మార్చేందుకు ప్రేమిస్తున్నాడా లేక నన్ను మోసం చేసేందుకు ప్రేమిస్తున్నాడా? వాడు మోసగాడేమో?’’అనే అనుమానాలు మీకు వస్తాయి. వెంటనే ఆత్మరక్షణలో పడిన మీరు ఎవరినీ మీదగ్గరకు రానివ్వరు, మిమ్మల్ని ప్రేమించనివ్వరు, మీరుకూడా ఎవరినీ ప్రేమించరు. అప్పుడు ఎవరూ మిమ్మల్ని ప్రేమించట్లేదనే భావన మీ మనసులో చాలా బలంగా నాటుకుపోతుంది. అలా ప్రేమకు దూరమైన మీరు ఎవరికీ దగ్గర కాలేక ఒంటరిగా మిగిలిపోతారు. ఆ ఒంటరితనం మిమ్మల్ని మరింత భయపెడుతుంది. ఆ భయం గురించి కాస్త లోతుగా ఆలోచిస్తే ‘‘అస్తిత్వంతో అనుబంధం లేకపోవడంవల్లనే మీరు ఒంటరిగా మిగిలిపోయారనే వాస్తవం’’ మీకు తెలుస్తుంది.
భయమంటే ‘అస్తిత్వంతో అనుబంధాన్ని కోల్పోవడమే.’’
ఉయ్యాలలో నిద్రపోతున్న పసివాడికి మెలకువ వచ్చి చుట్టూ చూస్తాడు. కానీ వాడికి ఎవరూ కనిపించరు. ఎందుకంటే, అందరూ సినిమాకు వెళ్ళారు. దానితో ఒంటరితనానికి గురైన ఆ పసివాడు ఏడవడం ప్రారంభిస్తాడు. భయమంటే అదే. మిమ్మల్ని పెంచిన తీరే ఇందుకు ముఖ్యకారణం. ఎందుకంటే, మీలో ప్రేమ కలిగేలా, ఆ ప్రేమ మీలో ఎదిగేలా ఎవరూ మిమ్మల్ని పెంచలేదు.
ఒక్క ప్రేమలో తప్ప ఇతర విషయాలన్నింటిలోను మానవాళికి శిక్షణ ఇవ్వడం జరిగింది. కేవలం చంపేందుకు కొన్ని సంవత్సరాలు శిక్షణ ఇచ్చి సైన్యాన్ని తయారుచేసుకుంటాం. కేవలం మీరు మోసపోకుండా ఇతరులను మోసం చెయ్యగల అనేక లెక్కలను కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కొన్ని సంవత్సరాలపాటు బోధిస్తూ శిక్షణఇస్తాయి. అంతేకానీ, స్వేచ్ఛగా ఎలా ప్రేమించుకోవాలో, ప్రేమకు స్వేచ్ఛను ఎలా ఇవ్వాలో ఎవరూ బోధించరు. పైగా, అలాంటి ప్రయత్నాలు చేసిన వారిని సమాజం ఎప్పుడూ అడ్డుకుంటూనే ఉంటుంది.
పిల్లలు ప్రేమలో పడేందుకు తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడరు. ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని నాటకాలాడినా పిల్లల ప్రేమను పెద్దలు ఒప్పుకోరు. ఎందుకంటే, ప్రేమలోపడిన పిల్లలకు అదే లోకమైపోతుంది. దానికోసం వారు ఏకాంతాన్ని కోరుకుంటారు. ఉమ్మడి కుటుంబాలలో అది కుదరదు కాబట్టి, వారు ‘వేరుకాపురం’ పెట్టేందుకు సిద్ధపడి కుటుంబానికి దూరమైపోతారు. అందుకే తల్లిదండ్రులు తమకు నచ్చిన సంబంధానే్న నిశ్చయిస్తారు. దానితో అది ఒక సామాజిక వ్యవహారంగా మారుతుంది. అప్పుడు మీకు నచ్చినా, నచ్చకపోయినా కాపురం కొనసాగించక తప్పదు.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.