క్రీడాభూమి

ఆసియాలో అత్యుత్తమ టోర్నీగా చైనీస్ సూపర్ లీగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాంఘై, ఏప్రిల్ 4: ఆసియాలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌గా చైనీస్ సూపర్ లీగ్ (సీఎస్‌ఎల్)ను తీర్చిదిద్దుతామని చైనా ఫుట్‌బాల్ సంఘం (సీఎఫ్‌ఏ) హామీ ఇచ్చింది. ఇటీవల కాలంలో సీఎస్‌ఎల్ ఆసియా ఫుట్‌బాల్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నది. దేశదేశాల నుంచి ఆటగాళ్లను ఆకర్షిస్తున్నది. దీనిని మరింత ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దడం ద్వారా, సాకర్ ప్రపంచానికి అత్యుత్తమ ఆటగాళ్లను అందించాలన్నదే తమ లక్ష్యమని సీఎప్‌ఏ ప్రకటించింది. ఫుట్ అంటే ఎంతో ఇష్టపడే చైనా అధ్యక్షుడు కూడా సీఎస్‌ఎల్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. ఈ టోర్నీకి అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ సాకర్ రంగంలో చైనా గుర్తింపు సంపాదించాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో చైనా ప్రస్తుతం 72వ స్థానంలో ఉంది.