కృష్ణ

చుక్కలు చూపిస్తున్న సూరీడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు) : భానుడి ప్రతాపానికి వృద్ధులు, చిన్నారులు అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటలు దాటితే ప్రచండ భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలు అధికమవటంతో పట్టణంలోని ప్రజలు వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు శీతల పానీయాలను, వివిధ రకాల పండ్ల రసాలపై మక్కువ చూపుతున్నారు. దీంతో శీతల పానీయాలు, పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. అలాగే పల్లెల్లో కొబ్బరి బొండాలు, తాటిముంజలు దర్శనమిస్తున్నాయి. జాతీయ రహదారి వెంట కొబ్బరి బొండాలు, తాటి ముంజలు, సుగంధ, నిమ్మకాయి షోడాలు వంటి చిరు దుకాణాలు వెలిశాయి. అయితే చిన్న, పెద్ద తారమత్యం లేకుండా ప్రతి సందర్భాలలో కూల్‌డ్రింక్స్‌నే వాడుతున్నారు. అలాగే పుచ్చకాయల ముక్కలు నోరూరిస్తున్నాయి. గతంలో ప్రతి శుభకార్యంలో టీ, టిఫిన్, కాఫీ ఇచ్చే వారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారిపోయి, ప్రతి దానికి కూల్‌డ్రింక్స్‌నే వాడుతున్నారు. అయితే కూల్ డ్రింక్స్ కన్నా ప్రకృతి ప్రసాదించిన పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు, పుచ్చకాయల ముక్కలనే వాడాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది చెరకు రసాల బండ్లు అధికమయ్యాయి.

*