రంగారెడ్డి

పార్కు స్థలాల కబ్జాలపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఏప్రిల్ 23: పోచారం పురపాలక సంఘం పరిధిలో కబ్జాకు గురైన పార్కు స్థలాలు, ప్రభుత్వ భూములను గుర్తించి కబ్జా దారులపై చర్యలు తీసుకుంటామని ప్రత్యేకాధికారి సౌమ్య తెలిపారు. పోచారం పురపాలక సంఘం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆమే పాల్గొని పార్కు స్థలాల కబ్జాలపై విచారణ జరిపారు. మొత్తం పార్కు స్థలాల వివరాలు, కబ్జాకు గురైన పార్కు స్థలాలు, కబ్జాలకు పాల్పడిన వారి వివరాలను వెంటనే తెలియ జేయాలని అధికారులను ఆదేశించారు. పురపాలక సంఘ పరిధిలో పచ్చదనం, పరిశుభ్రత, తడి పొడి చెత్త, ప్లాస్టిక్ నిషేదంపై సమావేశంలో చర్చించారు. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. వర్షకాలం ప్రారంభం కాగానే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టేందుకు మొక్కలను సిద్దం చేయాలని చెప్పారు. వేసవి కాలం సందర్భంగా తాగునీటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలనీలలలో చెత్త పేరుకు పోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుని పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో మేనేజర్ శ్రావన్‌కుమార్, అయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి మల్లారెడ్డిని కలిసిన గౌడవెల్లి నేతలు
మేడ్చల్, ఏప్రిల్ 23: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని మంగళవారం మండలంలోని గౌడవెళ్లి గ్రామానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. గౌడవెళ్లి టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థిగా అప్పంగారి పద్మ జగన్‌రెడ్డిని ప్రకటించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. పుష్పగుచ్ఛాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో నాయకులు జగన్‌రెడ్డి, దయానంద్, సింహాలు, రాజ్‌గోపాల్ రెడ్డి, రవి ఉన్నారు.