రంగారెడ్డి

న్యాయ పరంగా భూసేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఏప్రిల్ 23: ప్రజల తాగునీటి అవసరాల కోసం రైతుల నుండి న్యాయపరంగా భూసేకరణ చేస్తామని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో కేశ్వాపూర్ రిజర్వాయర్ భూసేకరణకై శామీర్‌పేట్ మండలానికి చెందిన పొన్నాల గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు కేశ్వాపూర్ రిజర్వాయర్‌ను నిర్మించేందుకు తప్పనిసరి పరిస్ధితుల్లో రైతుల నుండి 105 ఎకరాల తొమ్మిది గుంటల పట్టా భూమిని భూ సేకరణ చేస్తామని వివరించారు. ఒక అధికారిగా కాకుండా రైతు బిడ్డగా ఆలోచించి ఎకరానికి 70 లక్షలు నష్టపరిహారం చెల్లించుటకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. రైతులు అందుకు అంగీకరించటంతో కలెక్టర్ రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఒ లచ్చిరెడ్డి, పొన్నాల గ్రామ రైతులు పాల్గొన్నారు.
కన్నుల పండువగా శ్రీవారి సేవ
హయత్‌నగర్, ఏప్రిల్ 23: లింగోజిగూడ డివిజన్ గ్రీన్‌పార్క్‌కాలనీ శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ పద్మావతీ గోదాసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి చంద్రప్రభ వాహనసేవ కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం నిత్యహవనము, బలిహరణ, నివేదన, తీర్ధప్రసాదగోష్టి, సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం నివేదన, తీర్థప్రసాదగోష్టి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు జగన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, కోశాధికారి టి. శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ అడ్వయిజర్స్ కె.ఆర్ మహిపాల్‌రెడ్డి, జి.విజేందర్‌రెడ్డి, కార్యినిర్వహణ కార్యదర్శులు దేవేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మరుగుదొడ్లతో స్వచ్ఛ్భారత్ సాధ్యం
మర్పల్లి, ఏప్రిల్ 23: గ్రామాలలో మరుగుదొడ్లు నిర్మించుకోవడంతో స్వచ్ఛంగా మారి స్వచ్ఛ్భారత్ సాధ్యమని ఎండీఓ బి.నాగలక్ష్మి అన్నారు. మంగళవారం పట్లూర్, మర్పల్లిలో గ్రామస్తులకు మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కల్పించారు. మరుగుదొడ్లు లేక ఆరుబయట మలమూత్రాలు చేయడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, 80 శాతం రోగాలు వీటిద్వారా సంక్రమిస్తున్నాయని అన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరి అని, ప్రభుత్వం 12వేల రూపాయలు అందిస్తున్నదని ఇంకా అవసరమైతే లబ్ధిదారులు వేసుకోవాలని అన్నారు. ఫీల్ట్ అసిస్టెంట్లు గ్రామాలలో లబ్ధిదారులు మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలని అన్నారు. ఇరు గ్రామాల సర్పంచ్‌లు, ఏపిఎం మధుకర్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, ఫీల్ట్ అసిస్టెంట్ లక్ష్మయ్య వార్డు మెంబర్లు పాల్గొన్నారు.