తెలంగాణ

కాళీయ మర్దనుడిగా యాదగిరీశుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, మే 16: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు రెండో రోజు గురువారం పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం వైభవోపేతంగా కొనసాగాయి. బాల ఆలయంలో ఉదయం నిత్య హవనములు, మూలమంత్ర జపములు, లక్ష్మీసూక్త శ్రీ విష్ణు సహస్రనామ పారాయణములు నిర్వహించారు. మంగళ నీరాజనం, మంత్ర పుష్ప కైంకర్యాలు, లక్ష కుంకుమార్చనలను శాస్తయ్రుక్తంగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో కుంకుమార్చనలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని కాళీయ మర్దన శ్రీ కృష్ణాలంకారంలో అలంకరించి పల్లకీసేవ నిర్వహించారు. భగవానుడి దివ్యావతరాల్లో విశిష్టమైన శ్రీ కృష్ణాలంకార సేవలో దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకుని భక్తులు పులకించారు. కాళీయుడి గర్వమణిచి గోకుల వాసులను, యమున జలాలను సంరక్షించిన రీతిలో భగవానుడు దుష్టులను శిక్షించి వారి అహం అనే విషపు కోరలను చిదిమివేసి శిష్టులను రక్షిస్తారనే సందేశం కాళీయ మర్దన కృష్ణావతారం విశిష్టతగా భావిస్తారు. సాయంత్రం స్వామివారిని శ్రీ రామా అవతార అలంకార సేవలో శ్రీ హనుమత్ వాహనంపై విహరింపచేశారు. ధర్మస్వరూపడుడైన శ్రీరాముడు కుటుంబ విలువలను, రాజ్య విలువల ఆదర్శలను చాటి చెప్పి ఒకే మాట ఒకే బాణం, ఒకే పత్ని అంటూ మర్యాద పురుషోత్తముడిగా భారతీయ సంస్కృతిని సంపూర్ణం చేసిన విశిష్టత రామావతారం సందేశం. మహాబలశాలి, మేధావి, వేద వేదాంగ పారంగతుడు తన భక్తుడైన హనుమంత్ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు భక్తులను సదా రక్షిస్తానంటూ అభయమిచ్చాడు. ఆలయ ప్రధానార్చకులు నంధీగల్ లక్ష్మీనరసింహాచార్యుల సారథ్యంలో సాగిన అలంకార, వాహన పల్లకీ సేవల్లో వైటీడీఏ వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు, ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూ ర్తి, ఆలయ అధికారులు, అర్చక, పండితులు పాల్గొన్నారు. సాయంత్రం సంగీతభవన్‌లో జయంతి ఉత్సవాల విశిష్టత, స్వామివారి మహిమలను చాటుతూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి.
అటు పాతగుట్టలోను స్వామి జయంత్యుత్సవాల్లో భా గంగా అలంకార, వాహన సేవలు, లక్ష కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు.
చిత్రం... కాళీయ మర్దనుడిగా కొలువై పురవీధుల్లో ఊరేగుతున్న లక్ష్మీనరసింహుడు