కృష్ణ

గొంతెండుతున్నా పట్టించుకోరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: గొంతులెండుతున్నా పట్టించుకునే నాధుడే లేడా అంటూ మంగళవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు అధికారులపై ధ్వజమెత్తారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ కృత్తికా శుక్లా హాజరయ్యారు. తమ ఎన్నిక తర్వాత తొలిగా జరిగిన ఈ సమావేశానికి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు హాజరై తమ తమ నియోజకవర్గాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. గుక్కెడు నీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నమైందన్నారు. సమస్య తీవ్రతను తగ్గించకుంటే పరిస్థితులు మరింత దారుణంగా మారే ప్రమాదం లేకపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి అవసరాల నిమిత్తం అరకొరగా విడుదల చేసిన నీరు ఏ మాత్రం ప్రజలకు అక్కరకు రావడం లేదన్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో మంచినీటి చెరువులు వట్టి పోయి కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా డెల్టా శివారు ప్రాంతాలైన అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం, కైకలూరు నియోజకవర్గాల్లో పరిస్థితులు దారుణంగా మారాయని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. పలు గ్రామాల్లో మంచినీటి చెరువుల సంరక్షణ లేకపోవటం వల్ల వచ్చిన నీటితో ఆ చెరువులను నింపడానికి కూడా సాధ్యపడటం లేదన్నారు. దివిసీమతో పాటు మచిలీపట్నం, పెడన, పామర్రు నియోజకవర్గాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కలగాలంటే ప్రకాశం బ్యారేజీ నుండి పులిగడ్డ వరకు వరకు ఉన్న కృష్ణానదిపై నాలుగు చెక్ డ్యామ్‌లు నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ తెలిపారు. ఏటిమొగ, ఎదురుమొండి వద్ద రబ్బరు డ్యామ్‌ల నిర్మాణం వల్ల సంవత్సరం పొడవునా తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నారు. ఈ విషయమై జిల్లాకు చెందిన మంత్రులు, కలెక్టర్ దృష్టి సారించి చెక్ డ్యామ్‌ల నిర్మాణ ఆవశ్యకతను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యపై జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ స్పందిస్తూ డెల్టాలోని 25 మండలాల్లో తప్ప అన్ని మండలాల్లో తాగునీటి సమస్య ఉందన్నారు. సమస్య పరిష్కారంపై ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూనే ఉన్నామన్నారు. కృష్ణానది రివర్ బండ్ నుండి తాగునీటిని విడుదల చేస్తామన్నారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కారానికి ఇరిగేషన్ అధికారులు ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జలవనరులు, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా అధికారులు సమన్వయంతో వ్యవహరించి గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 26వతేదీ నుండి అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫాం కొరత లేకుండా చూడాలన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. మరో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వం పౌర సరఫరాల విభాగం నుండి రూ.3వేల కోట్లను ఇతర అవసరాలకు వినియోగించిందన్నారు. ఇందులో రూ.2వేల కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఉందన్నారు. ఆ మొత్తాన్ని నేరుగా ప్రభుత్వమే రైతులకు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రూ.850కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. త్వరలోనే బకాయి మొత్తాన్ని చెల్లిస్తామన్నారు. అక్షయ పాత్ర ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఇకపై రేషన్ బియ్యం సరఫరా కాదన్నారు. అక్షయ పాత్ర ద్వారా 40కిలో మీటర్ల పరిధిలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు రుచికరమైన భోజన సరఫరా జరుగుతుందన్నారు. ప్రభుత్వం కేవలం వారికే సొమ్ము మాత్రమే చెల్లిస్తుందన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వ పాలన ఉండబోతుందన్నారు. అన్ని రంగాల్లోనూ జిల్లాను అభివృద్ధి పర్చి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకు అధికారులు కూడా ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఇఓ షేక్ సలాం, జెసీ-2 పిడుగు బాబూరావు, ట్రైనీ కలెక్టర్ అనుపమ, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ శాయన పుష్పవతి, ఎమ్మెల్యేలు కొక్కిలిగడ్డ రక్షణ నిధి, కైలే అనీల్, మొండితోక జగన్మోహనరావు, దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, కెఎస్ లక్ష్మణరావు, ఎఎస్ రామకృష్ణ, జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కొలువు తీరిన కొత్త ఎమ్మెల్యేలు

* తొలి సమావేశానికే పలువురు డుమ్మా

* పూట సమీక్షకే పరిమితమైన మంత్రులు, ఎమ్మెల్యేలు

మచిలీపట్నం, జూన్ 11: సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిగా జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొలువు తీరారు. వీరికి ఈ సమావేశం తొలిది కాగా పాలకపక్షంగా ఉన్న వారికి చిట్ట చివరి సమావేశం కావడం విశేషం. అధికార, ప్రతిపక్ష సభ్యులంతా సమావేశానికి పూర్తి స్థాయిలో హాజరు కావటంతో సమావేశ మందిరం కిక్కిరిసింది. సభ్యులే కాకుండా కొత్తగా ఎన్నికైన మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు కూడా అత్యుత్సాహంతో సమావేశ మందిరంలోకి వచ్చేశారు. దీంతో అధికారులు, పాత్రికేయులకు కూర్చోవడానికి కుర్చీలు లేకుండా పోయాయి. సమావేశం ప్రారంభంలోనే సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సభ్యులు కాని వారిని బయటకు వెళ్లాలని కోరినా ఎవ్వరూ వెళ్ల లేదు. ఇదిలా ఉండగా జిల్లాలోని ఇరువురు ఎంపీలతో పాటు ఆరుగురు శాసనసభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. మచిలీపట్నం, విజయవాడ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీ, వైసీపీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, జోగి రమేష్, వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్ హాజరు కాలేదు. మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ పశ్చిమ నుండి ఎన్నికై మంత్రులైన పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని), వెల్లంపల్లి శ్రీనివాస్‌లు వేదిక మీద కనువిందు చేశారు. సీనియర్ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధితో పాటు తొలిగా ఎన్నికైన సింహాద్రి రమేష్, కైలే అనీల్ కుమార్, దూలం నాగేశ్వరరావు, మొండితోక జగన్మోహనరావులు, ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఎఎస్ రామకృష్ణ, బచ్చుల అర్జునుడు సమావేశానికి హాజరై తమ తమ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టారు. అయితే సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఉదయం జరిగిన సమీక్షకే పరిమితమయ్యారు. భోజన విరామం అనంతరం ఏ ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమావేశం కానరాకపోవటం గమనార్హం.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

* ప్రతి రైతుకీ పెట్టుబడి నిధి అందిస్తాం

* తొలకరి ప్రారంభంలోనే గిట్టుబాటు ధరలు ప్రకటిస్తాం

* రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, జూన్ 11: రైతాంగ సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. బందరు మండలం గోకవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఎసీఎస్) నూతన భవనాన్ని అప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావుతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీ మేరకు అక్టోబర్ 15వతేదీ నుండి వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు వ్యవసాయ పెట్టుబడిగా రూ.12వేల 500లు అందించనున్నట్లు చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల భారి నుండి రైతులను కాపాడేందుకు పంటల బీమా పథకం కింద రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి 50 కుటుంబాలకు గ్రామ వాలంటీర్లను నియమించి రేషన్, పెన్షన్, రైతు రుణాలు, ప్రతి ఒక్కరికీ ప్రతి గడపకు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. రేషన్ షాపుల ద్వారా బాగు చేసిన సన్న బియ్యం సెప్టెంబర్ 1వతేదీ నుండి అందించనున్నట్లు తెలిపారు. 2014-19 సంవత్సర మధ్య కాలంలో రాష్ట్రంలో వ్యవసాయదారులకు రూ.2వేల కోట్ల నష్టపరిహారం బకాయిలను ప్రభుత్వమే రైతులకు చెల్లిస్తుందన్నారు. జూన్ మాసం తొలకరిలోనే రైతులు పండించే ధాన్యం, అపరాలు తదితర పంటలకు గిట్టుబాటు ధరలు ప్రభుత్వం ముందుగా ప్రకటించనుందని తెలిపారు. ధరల స్థిరీకరణకు రూ.3వేల కోట్లుతో ప్రత్యేక నిథి ఏర్పాటు చేయుటకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు తీసుకున్న పంట రుణాలపై వడ్డి రాయితీ లభించేది కాదని, తమ ప్రభుత్వం పంట రుణాలన్నింటికీ వడ్డీ రైతుల తరఫున ప్రభుత్వమే బ్యాంక్‌ల్లో జమ చేసి రశీదులు గ్రామ వాలంటీర్ల ద్వారా రైతుల ఇళ్లకు వెళ్లి అందచేయనున్నట్లు తెలిపారు. ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ సీఎం జగన్మోహనరెడ్డి బాధ్యతలు చేపట్టాకు పేద, రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ పెన్షన్‌ల పెంపు, ఆరోగ్యశ్రీ పటిష్ఠవంతంగా అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ అధ్యక్షుడు జి పెద వెంకయ్య, కెడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ రాంబాబు, కెడీసీసీ డైరెక్టర్లు సమ్మెట సత్యనారాయణ, గుంజా విజయ కుమార్, మధుసూదనరావు, మాజీ జెడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు బూరగడ్డ రమేష్ నాయుడు, వాలిశెట్టి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీలో కలకలం!

* కనె్వన్షన్ హాల్ శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన దుండగులు

* వైసీపీ వారి పనేనని పాలకపక్ష సభ్యుల ఆరోపణ

* జెడ్పీలో భారీగా మోహరించిన పోలీసులు

* బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్ని హామీ

మచిలీపట్నం, జూన్ 11: జిల్లా పరిషత్ కనె్వన్షన్ సెంటర్ ప్రారంభ శిలాఫలకం ధ్వంసం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని దుండగులు కనె్వన్షన్ సెంటర్ శిలాఫలకాన్ని ధ్వంసం చేయగా జెడ్పీలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత పాలకపక్ష చివరి సమావేశం మంగళవారం జరుగుతున్న నేపథ్యంలో ఏదో ఒక రకమైన అలజడి సృష్టించేందుకు ఇటీవలే అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్ సీపీకి చెందిన వ్యక్తులు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారని జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధతో పాటు పాలక పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే గత ఫిబ్రవరి నెలలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కనె్వన్షన్ సెంటర్‌ను ప్రారంభించారు. అయితే బందరు ఓడరేవు నిర్మాణ పనుల ప్రారంభోత్సవ శిలాఫలకంతో పాటు కనె్వన్షన్ సెంటర్‌తో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలను నాడు చంద్రబాబు నాయుడు రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు. శిలాఫలకం ఆవిష్కరణ నాటికి జెడ్పీ కనె్వన్షన్ సెంటర్ నిర్మాణం పూర్తి కాలేదు. అసంపూర్తిగా మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేసిన అధికారులు సోమవారం రాత్రి జెడ్పీ కనె్వన్షన్ సెంటర్ వద్ద చంద్రబాబు నాయుడు పేరు మీద శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ శిలాఫలకాన్ని రాత్రికి రాత్రే గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ధ్వంసమైన శిలాఫలకాన్ని జెడ్పీ సీఇఓ షేక్ సలాం పరిశీలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో భారీగా పోలీసులు జెడ్పీలో మొహరించారు. దీనిపై సీఇఓ వివరణ ఇస్తూ గతంలో చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకానే్న ఇక్కడ ఏర్పాటు చేశాము గానీ కొత్తగా ఏమీ చేయలేదన్నారు. మంగళవారం జెడ్పీ సర్వసభ్య సమావేశ సమావేశం జరుగుతున్న దృష్ట్యా ప్రజాప్రతినిధులు, సభ్యులు, అధికారుల భోజన వసతి కోసం తొలిగా కనె్వన్షన్ సెంటర్‌ను వినియోగించుకునేందుకు మాత్రమే ఏర్పాట్లు చేశామని తెలిపారు.

శిలాఫలకం పునరుద్ధరణకు జెడ్పీలో తీర్మానం
శిలాఫలకం ధ్వంసం అంశంపై జెడ్పీ సర్వసభ్య సమావేశంలో శాసనమండలి సభ్యుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు లేవనెత్తారు. శిలాఫలకాల ధ్వంసం ఏ రకమైన సంకేతమంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని కొనసాగించాలే తప్ప అభివృద్ధిని కాలరాసే విధంగా వ్యవహరించడం సరి కాదన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించటంతో పాటు నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధ్వంసమైన శిలాఫలకాన్ని పునరుద్ధరించాలని జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ జెడ్పీలో తీర్మానం చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీల పరిశీలించి నిందితులను త్వరలోనే గుర్తిస్తామని డీఎస్పీ మొహబూబ్ బాషా తెలిపారు.