తెలంగాణ

కుశ్వంత్ ఆర్థిక స్థితిపై స్పందించిన కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, జూన్ 12: మొన్నటి వరకు ఉన్నత చదువులపై ఆందోళనలో ఉన్న ఎంపటి కుశ్వంత్ నేడు ఖుషీ అవుతున్నాడు. ఏకంగా ముఖ్యమంత్రి తనయుడు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా ట్విటర్ వేదికగా స్పందించి కుశ్వంత్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మంగళవారం ‘ఆంధ్రభూమి’ మెయిన్‌లో ప్రచురితమైన ‘సీటు రమ్మంటోంది.. ఫీజు పొమ్మంటోంది’ అనే కథనాన్ని టీఆర్‌ఎస్‌కు చెందిన కుమార్ సంజయ్‌దాస్ కేటీఆర్‌కు ట్విట్ చేశాడు. నీట్‌లో 55వ ర్యాంకు వచ్చినా ఆర్థిక పరిస్థితుల కారణంగా చదవలేని కుశ్వంత్ దుస్థితిని గురించి తెలుసుకున్న కేటీఆర్ వెంటనే స్పందించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి కుశ్వంత్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలపాలని ఆదేశించారు. బుధవారం భూపాలపల్లి ఆర్డీవో వెంకటాచారి తన కార్యాలయంలో కుశ్వంత్‌ను సన్మానించి అతని వివరాలు సేకరించారు. తనకు అన్ని విధాలా సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ఆర్డీవో కుశ్వంత్‌కు తెలిపారు. మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆర్డీవో కుశ్వంత్‌ను ఆశీర్వదించారు. కుశ్వంత్‌కు సంబంధించిన వివరాలను కేటీ ఆర్ కార్యాలయానికి పంపించనున్నట్టు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ‘ ఆంధ్రభూమి’కి తెలిపారు.

చిత్రాలు.. ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కలెక్టర్‌కు పంపిన మెసేజ్
*కుశ్వంత్‌ను ఆశీర్వదిస్తున్న ఆర్డీవో వెంకటాచారి