తెలంగాణ

హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు అంతా సిద్ధం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, జూన్ 16: మరో 3నెలల్లో జరుగనున్న హుజూర్‌నగర్ ఎమ్మెల్యే ఉప ఎన్నికకు కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు సర్వం సిద్దం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు ఇచ్చారు.
ఆదివారం పట్టణంలోని గడ్డిరెడ్డి అనసూర్య పంక్షన్ హల్‌లో జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల, ప్రజాప్రతినిధుల, ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ 2009 నుండి నేటి వరకు హుజూర్‌నగర్ నియోజకవర్గంలో చారిత్రాత్మక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయించానని అన్నారు. మొత్తం కృష్ణా నదీ తీరప్రాంతాలకు త్రాగు, సాగు నీరు రప్పించి, మట్టపల్లి వద్ద నదిపై వంతెన నిర్మాణం చేయించానని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5సంవత్సరాల 6 నెలలు దాటినా నియోజకవర్గంలో ఒక్క పని చేయలేదని రామస్వామి గుట్ట వద్ద గృహాలు పూర్తి చేసి పంపీణీ చేయకుండా గలీజు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తాను సామాన్య ప్రజలకు మేలు చేయటానికే రాజకీయాలకు వచ్చానని పోలీసులను బెదరించి కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేస్తే సహించమని ప్రజాస్వామ్య పద్దతిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇక నుండి ప్రతి శని, ఆదివారాలలో హుజూర్‌నగర్‌లోనే ఉంటానని, పార్లమెంటు సమావేశాలలో ఉన్నా అక్కడి నుండే మీసమస్యలపై పోరాడుతానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని మీరు ఆత్మపరిశీలన చేసుకుని కాంగ్రెస్ పార్టీ బలపడిందా, బలహీనపడిందా నివేదికి సిద్దం చేయాలని అన్నారు.
రామస్వామి గుట్ట 4వేల గృహలపై వారం రోజుల్లో ప్రభుత్వం తేల్చకుంటే నిరసన దీక్ష చేస్తా
కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4వేల గృహాల కాలనీ మంజూరు చేసి 203 కోట్ల రూపాయలు విడుదల చేసి 80 శాతం పూర్తిచేస్తే గత 6 సంవత్సరాలుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం గలీజు రాజకీయాలు చేస్తున్నదని టీపీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నియోజకవర్గంలో ఒక్క పని చేయకపోగా పెండింగ్ పనులు కూడా పూర్తి చేయకుండా అభివృద్దిని నిరోధిస్తున్నదని తాను సీఎం, గృహనిర్మాణ మంత్రికి, జిల్లా మంత్రికి అనేక సార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని వారం రోజుల్లో తేల్చకుంటే హుజూర్‌నగర్‌లో నిరసన దీక్ష చేపడుతానని ఉత్తమ్ ప్రకటించారు. పోలీసులు గులాబీ చొక్కాల ఏజంట్లలా పనిచేయవద్దని చట్టం, ధర్మం, న్యాయం ప్రకారం పనిచేయాలని ప్రజా ధనంతో జీతాలు పొందుతున్నామనే విషయం మరువరాదని అన్నారు. ఐకేపి ద్వారా రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంకా నగదు చెల్లించలేదని వెంటనే చెల్లించకుంటే ఆందోళన చేస్తామని అన్నారు. సోమవారం నుండి పార్లమెంటు సమావేశాలు ఉన్నందున అత్యవసరంగా నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేసినా భారీ ఎత్తున వచ్చారని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన వారికి అభినందనలని, ఓడిపోయిన వారు బాధ పడవలసిన అవసరం లేదని మీ కష్టాలు, నష్టాలు తీరుస్తానని పార్లమెంటు లోపలా, బయటా ఈ ప్రాంత సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లుతానని అన్నారు. మీరంతా గర్వపడే విధంగా పార్లమెంటులో ప్రజాసమస్యలు ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని 1999 నుండి 2018 వరకు కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రస్తుతం ఎంపీగా ఆశీర్వదించారని కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటానని ఉత్తమ్ అన్నారు.