క్రీడాభూమి

అవకాశాలు సజీవమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 16: ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ నాకౌట్ దశకు చేరే అవకాశాలు లేకపోలేదని మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ అన్నాడు. ఐసీసీ వెబ్‌సైట్‌లో రాసిన వ్యాసంలో అతను విండీస్ జట్టులో సమర్థులైన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారని తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సంచలనాలు సృష్టించే సత్తాగల క్రికెటర్లతో కూడిన విండీస్ ఏ క్షణంలోనైనా ఎదురుదాడికి దిగడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంత వరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడి, ఒక విజయంతోపాటు ఒక మ్యాచ్ రద్దుకావడంతో విండీస్ మూడు పాయింట్లు సంపాదించిందని, మిగతా రెండు మ్యాచ్‌లను కోల్పోయిందని లాయిడ్ గుర్తుచేశాడు. అయితే, సాంకేతికంగా ఇప్పటికీ విండీస్‌కు నాకౌట్ చేరే అవకాశాలకు తెరపడలేదని స్పష్టం చేశాడు. ఆదివారం బంగ్లాదేశ్‌ను ఓడించి, ఆతర్వాత న్యూజిలాండ్, భారత్ వంటి బలమైన జట్లను ఢీకొనేందుకు రంగం సిద్ధం చేసుకోవాలని జట్టు సభ్యులకు సూచించాడు.