రాశిఫలం -06/19/2019

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
బహుళ విదియ మ.2.17, కలియుగం - 5121 శాలివాహన శకం - 1941
నక్షత్రం: 
పూర్వాషాఢ మ.12.55
వర్జ్యం: 
రా.9.31 నుండి 11.14 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.11.36 నుండి 12.24 వరకు
రాహు కాలం: 
మ.12.00 నుండి 1.30 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వుంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కీళ్లనొప్పుల బాధనుండి రక్షించుకోడం అవసరం. మనోవిచారాన్ని కలిగివుంటారు.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశముంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వుంటుంది. ఆత్మీయులను కలియుటలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసలవల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలెక్కువగా వుంటాయి. స్ర్తిల మూలకంగా ధనలాభముంటుంది.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) అనవసరంగా డబ్బు ఖర్చగుటచే ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. ఋణప్రయత్నాలు చేస్తారు.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కుటుంబ విషయాలపై అనాసక్తితో వుంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్ర్తిలతో జాగ్రత్తగా నుండుట మంచిది.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశముంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా నుండుట మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చినచో అనారోగ్య బాధలుండవు.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) అనుకోకుండా కుటుంబంలో కలహాలేర్పడే అవకాశముంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. మనస్తాపానికి గురి అవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొందుతారు.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) తోటివారితో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. కుటుంబ విషయాలందు అనాసక్తితో వుంటారు. స్ర్తిలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
Date: 
Wednesday, June 19, 2019
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి