కృష్ణ

ట్రస్టుబోర్డుపై వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 13: బందరు మండలం ఉల్లిపాలెం గ్రామంలో వేంచేసి వున్న శ్రీ హేమకోదండ రామాలయ మందిర ట్రస్టుబోర్డు వివాదాస్పదంగా మారింది. 1932 నుండి గ్రామస్తుల విరాళాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఇప్పుడు ఉన్నట్టుండి నూతనంగా గ్రామంలోని ఒక వంశీయులు ట్రస్టుబోర్డును ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. విజయవాడకు చెందిన ఒక న్యాయశాఖ ఉద్యోగి తన భార్యను అధ్యక్షురాలిగా, మరో ఐదుగురు కుటుంబ సభ్యులతో ట్రస్టుబోర్డును ఏర్పాటు చేశారు. 2015 సెప్టెంబర్ 8న ట్రస్టుబోర్డును రిజిస్టర్ చేయించగా నేటివరకు ఆ విషయం గ్రామస్తులకు తెలియకుండా గుట్టుగా ఉంచారు. త్వరలో శ్రీరామనవమి రానుండటంతో ఉగాది పండుగ రోజు ట్రస్టుబోర్డు ఫలకాన్ని రామాలయం గోడ మీద అంటించి వివాదానికి తెరలేపారు. ట్రస్టుబోర్డు ఏర్పాటును గ్రామస్తులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. తమ పూర్వీకుల నుండి రామాలయంలో గ్రామపెద్దల నిర్ణయాలు, గ్రామస్తుల చందాలతో శ్రీరామనవమి, వినాయక చవితి వేడుకలు జరిగాయని, ఇప్పుడు ఉన్నట్టుండి ఈ గుడి తమ వంశీయులదంటూ ట్రస్టుబోర్డు ఏర్పాటు చేయడంలో అంతర్యమేమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై బుధవారం సాయంత్రం రామాలయం వద్ద గ్రామసభ ఏర్పాటు చేయగా పెద్దసంఖ్యలో హాజరైన గ్రామస్తులంతా ట్రస్టుబోర్డుగా ఏర్పడిన వారిపై దుమ్మెత్తిపోశారు. గ్రామస్తుల అంగీకారం లేకుండా ట్రస్టుబోర్డు ఏర్పాటు చేయడమేమిటంటూ ఆవేశంతో ఊగిపోయారు. కొత్తగా ఏర్పాటు చేసిన ట్రస్టుబోర్డు ఫలకాన్ని కూడా ధ్వంసం చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై గ్రామ సర్పంచ్ శ్రీపతి గంగాభవానిని వివరణ కోరగా.. రామాలయం గ్రామకంఠం స్థలంలో ఉందని, కొన్ని దశాబ్దాలుగా గ్రామస్తులే ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటూ వచ్చారని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న కొందరు ఉల్లి వంశీయులు కావాలనే ఈ వివాదానికి తెరలేపారని ఆరోపించారు. రామాలయం ఉన్న స్థలం గ్రామకంఠం భూమి అని చెప్పడానికి తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. అనంతరం బందరు తాలూకా సిఐ ఎఎన్‌ఎన్ మూర్తి ఇరువర్గాలతో చర్చలు జరిపారు.

వాల్‌పోస్టర్లను నివారించకుంటే
బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌కు జరిమానా తప్పదు
విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 13: నగరంలో అనధికార వాల్‌పోస్టర్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలలో అలక్ష్యం వహించిన టౌన్‌ప్లానింగ్ అధికారిపై కమిషనర్ వీరపాండియన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బాధ్యతాయుత విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు గాను ముందుగా హెచ్చరించిన విధంగా వెయ్యి రూపాయల ఫైన్ విధించి జీతం నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం జరగబోయే 125వ జయంతి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకానున్న నేపథ్యంలో ఆయా పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించిన ఆయన విగ్రహం పరిసర ప్రాంతాల్లో పెయిటింగ్ వేసిన గోడలపై అనధికారికంగా వాల్‌పోస్టర్లను అంటించిన విషయాన్ని గుర్తించిన కమిషనర్ వీరపాండియన్ తక్షణమే వాల్‌పోస్టర్లను తొలగించాలని ఆదేశించారు. అంతేకాకుండా వాల్‌పోస్టర్ల నియంత్రణ చర్యలలో నిర్లక్ష్యం వహించిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌కు రూ.1000లు ఫైన్ విధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే సిఎం పాల్గొనే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి గ్రీనరీతో పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈకార్యక్రమంలో సిఎంహెచ్‌ఓ డాక్టర్ గోపినాయక్, ఇఇ పివికె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మహిళా కమిటీల ఏర్పాటుకు
పోలీసుల సన్నాహం
పెనమలూరు, ఏప్రిల్ 13: నగర పోలీస్ కమిషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిల్లో వార్డుల వారీగా మహిళా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు. పోరంకి ఎల్‌ఎన్ గార్డెన్స్‌లో బుధవారం విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ ఉమెన్స్ లీగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా చైతన్య సదస్సులో ఆయన ప్రసంగించారు. మహిళలు స్తానికంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని పోలీసులకు, సంబంధిత ప్రభుత్వ, ప్రైవేట్ శాఖలతో మమేకమైతే సమస్యలను అధిగమించవచ్చునని సూచించారు. మహిళల్లో ఆత్మస్థయిర్యం పెంపొందించడానికి, అన్యాయాన్ని ఎదిరించటానికి చట్టపరంగా రక్షణ పొందటానికి ఏ కష్టమొచ్చినా అండగా వుండటానికి పోలీస్ విభాగం అన్ని చర్యలు తీసుకుంటొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యం మేరకు కమిషనరేట్ పరిధిలో ఏ మహిళకూ అన్యాయం జరగకుండా చూస్తామని, మరిన్ని చైతన్య సదస్సులు నిర్వహించటానికి కృషి చేస్తామని సిపి పేర్కొన్నారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపి చెన్నుపాటి విద్య మాట్లాడుతూ సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులతో పాటు మహిళలపై కూడా వుందన్నారు. ప్రతి మహిళ అక్షరాస్యురాలై తన కాళ్లమీద తాను నిలబడి ఆర్థిక స్వావలంబన చేకూర్చుకుంటే పురోగతి కనపడుతుందన్నారు. మహిళా దినోత్సవం నిర్వహించి, ఇపుడు సదస్సు ఏర్పాటు చేసిన ఏకైక సిపి మనకు వుండటం ఆనందదాయకమన్నారు. గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి సభ్యులుగా చేరి ప్రభుత్వ సూచనలను పాటించి రక్షణ పొందాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు కాళిదాసు, వివి నాయుడులతో పాటు ప్రొఫెసర్ ఎంసి దాస్, మహిళా సంఘం నేతలు కృష్ణకుమారి, స్వరూపరాణి, సుధ ప్రసంగించారు.

ఆక్రమిత స్థలం స్వాధీనం
ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 13: గుణదలలోని దుర్గగుడి దేవస్థానం క్వార్టర్స్‌కు చెందిన స్థలాన్ని ఆక్రమించుకున్న వారి నుండి బుధవారం దేవస్థానం ఆధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గుణదలలోని దుర్గగుడి క్వార్టర్స్‌కు దక్షణంలో వైపు ఉన్న స్థలాన్ని కొంతకాలం క్రితం ఒక వ్యక్తి ఆక్రమించుకున్నారు. దీంతో దేవస్థానం అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కొద్దిరోజుల క్రితం న్యాయస్థానం సదరు వ్యక్తి ఆక్రమించుకున్న స్థలాన్ని వెంటనే ఖాళీ చేసి దుర్గగుడి దేవస్థానానికి అప్పగించాలని తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం నుండి దేవస్థానానికి అనుకూలంగా తీర్పు రావటంతో దుర్గగుడి ఇన్‌చార్జ్ ఇవో యస్‌యస్‌యస్ చంద్రశేఖర్ అజాద్ అక్రమిత స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం ఈకమిటిలో ఉన్న సభ్యులు ఉన్న దుర్గగుడి సహాయ ఇవో డి సాయిబాబా ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.

లాడ్జి గదిలో నగదు, గొలుసు మాయం
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: లాడ్జిలో దిగిన వ్యక్తికి చెందిన నగలు, నగదు మాయమయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం... బెంగళూరుకు చెందిన గాజులపల్లి శివశంకరరెడ్డి అనే సివిల్ ఇంజనీరు పనిమీద ఈనెల 11న నగరానికి వచ్చాడు. పండిట్ నెహ్రూ బస్టేషన్ ఎదురుగా ఉన్న హనుమాన్ లాడ్జిలో బస చేశాడు. అయితే 12వ తేదీ రాత్రి గది తలుపు గడియ వేసుకోకుండా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం లేచి చూడగా తన వద్ద ఉన్న 25వేల రూపాయలు నగదు, మెడలోని పది గ్రాముల బంగారు గొలుసు మాయమైంది.