క్రీడాభూమి

కోహ్లీ దూకుడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూన్ 27: అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగుల మైలురాయిని అతి తక్కువ ఇన్నింగ్స్‌లో చేరుకున్న బ్యాట్స్‌మెన్‌గా సచిన్ తెండూల్కర్, బ్రియాన్ లారా పేరిట ఉన్న రికార్డును టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బద్దలు చేశాడు. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న అతను, ఇరవైవేల అంతర్జాతీయ పరుగులను తక్కువ మ్యాచ్‌ల్లో పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. అతను 417 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. కాగా, ఈ ఫీట్‌ను అందుకోవడానికి సచిన్, లారాకు చెరి 453 ఇన్నింగ్స్ పట్టింది. రికీ పాంటింగ్ 464 ఇన్నింగ్స్, ఏబీ డివిలియర్స్‌కు 483 ఇన్నింగ్స్, రాహుల్ ద్రవిడ్‌కు 492 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి.
వరల్డ్ కప్‌లో వరుసగా నాలుగు పర్యాయాలు 50 లేదా అంతకు మించి పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లీ చేరాడు. నవ్‌జోత్ సింగ్ సిద్ధు 1987లో ఈ ఫీట్ నమోదు చేశాడు. బ్యాటింగ్ దిగ్గజయం సచిన్ తెండూల్కర్ 1996లో ఒకసారి, 2003లో మరోసారి వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లో యాభైకిపైగా పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ జాబితాలో ఇప్పుడు కోహ్లీ కూడా చేరాడు.
గత ఆరు ఇన్నింగ్స్‌లో కోహ్లీ వరుసగా 111 (నాటౌట్), 140, 157 (నాటౌట్), 16, 33 (నాటౌట్) చొప్పున పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 72 పరుగులు సాధించాడు.
చిత్రం...విరాట్ కోహ్లీ