రంగారెడ్డి

వృద్ధులకు చీరల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ టౌన్, జూన్ 30: మలయాళస్వామి ఆశ్రమంలో వృద్ధులకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. ఆదివారం షాద్‌నగర్ పట్టణంలోని మలయాళస్వామి ఆశ్రమంలో వాసవి, వనితా క్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో వృద్ధ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లబ్ నిర్వాహకులు మాట్లాడుతూ వాసవి, వనితా క్లబ్‌ల ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అనాథ వృద్ధ మహిళలకు చీరలు అందజేసి, అన్నదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మలిపెద్ది రంగయ్యగుప్త, మలిపెద్ది శ్రీనివాసులు, మలిపెద్ది రమణ, బెజుగం రమేష్, వనితాక్లబ్ అధ్యక్షురాలు ఆగీరు ఉమ, కోశాధికారి ధర్మపురం మంజుల, వేముల బాలరాజ్, తాటి విజయ్, పెండ్యాల జగదీష్, వెంకటేష్ గుప్త, సత్యనారాయణ పాల్గొన్నారు.
మహదేవపురం-జే బ్లాక్‌లో ఇళ్లు నిర్మించుకోవాలి
జీడిమెట్ల, జూన్ 30: మహదేవపురం-జే బ్లాక్‌లో ప్రభుత్వ అనుమతులతో ఫ్లాట్ ఓనర్‌లు ఇళ్లను నిర్మించుకోవాలని మహదేవపురం వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి యాదగిరి రెడ్డి సూచించారు. గాజులరామారం డివిజన్ మహదేవపురం వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో జే-బ్లాక్ ప్లాట్ ఓనర్స్‌తో సమావేశం జరిగింది. సమావేశంలో యాదగిరి రెడ్డి మాట్లాడుతూ మహదేవపురంలోని 329/2 నుంచి 10 వరకు గల స్థలం ప్రైవేటు పట్టా స్థలంగా పేర్కొంటూ 1972లో అప్పటి అధికారులు అసల్ శేత్‌వార్‌ను ఇచ్చారని తెలిపారు. సరైన పత్రాలు చూడకుండా తమ కాలనీలో అధికారులు కూల్చివేశారని, ప్రస్తుతం కోర్టు ద్వారా క్లియరెన్స్‌తో పాటు జీహెచ్‌ఎంసీ నుండి అనుమతులను పొంది ఇళ్లను నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ప్లాట్‌లను ఖాళీగా ఉంచితే డిస్ప్యూట్ ల్యాండ్‌గా ముద్రపడే అవకాశముందని, ప్లాట్ ఓనర్స్ అందరు జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతిని పొంది ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. సమావేశంలో సొసైటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రంగసాయి, నర్సింహా రెడ్డి, నాగరాజు, మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
కనీవిని ఎరుగని రీతిలో సభ్యత్వ నమోదు
బాలానగర్, జూన్ 30: బాలానగర్ డివిజన్‌లో కనీవిని ఎరుగని రీతిలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు చేపట్టాలని బాలానగర్ కార్పొరేటర్ కాండూరీ నరేంద్ర ఆచార్య అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని ఫిరోజ్‌గూడలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ బాలానగర్ డివిజన్‌లో గతంలో కంటే ఎక్కువగా సభ్యత్వాలు చేస్తామని అన్నారు. సీనియర్ నాయకులు పంజా రాంచందర్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు ఎడ్ల మోహన్ రెడ్డి కార్పొరేటర్ చేతుల మీదుగా క్రీయాశీలక సభ్యత్వం తీసుకున్నారు. సదానంద్, శంకర్‌గౌడ్, ఎం. ఎస్.కుమార్, ఆంజనేయులుగౌడ్, ఎలిజాల యాదగిరి, నాగేందర్‌గౌడ్, చంద్రపాల్, రేణుకాగౌడ్, సులోచన, లక్ష్మీ, బాబా, పాల రమేష్, సాయి, రాజేష్, చంద్రశేఖర్, యాదగిరి పాల్గొన్నారు.
సభ్యత్వ నమోదు భారీగా చేపట్టాలి
కేపీహెచ్‌బీకాలనీ, జూన్ 30: కేపీహెచ్‌బీకాలనీ డివిజన్‌లో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు భారీగా చేపట్టాలని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్ రావు అన్నారు. ఆదివారం డివిజన్‌లోని 9వ ఫేజ్ కార్యాలయంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుపై నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గం కో- అర్డినేటర్ సతీష్ అరోరా, డివిజన్ ఇన్‌చార్జి అడుసుమిల్లి వెంకటేశ్వర్‌రావు, జనగాం సురేష్‌రెడ్డి, నారాయణరాజు, జాస్తీ శ్రీ్ధర్, ప్రతాప్, హరిబాబు, శేషయ్య, పున్నారావు, రాంబాబు నాయుడు, సుబ్బరాజు, భాస్కర్, అనురాధ, కృష్ణకుమారి పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలి
వనస్థలిపురం, జూన్ 30: విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని మిమిక్రీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ చంద్రముఖి చంద్ర శేఖర్ అన్నారు.
వనస్థలిపురం భాష్యం పాఠశాల ఫ్రెషర్స్‌డే వేడుకలు చింతలకుంటలోని పల్లవి గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. చంద్ర శేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్ర శేఖర్ మాట్లాడుతూ, విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. ప్రిన్సిపాల్ సుజాత మాట్లాడుతూ, తమ పాఠశాల విద్యార్థులకు విద్యతోపాటు వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా రంగాలలో వారిని ప్రోత్సహిస్తూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని గుర్తు చేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఎంతగానో అలరింప జేశాయి. భాష్యం పాఠశాలల జేడ్‌ఈ మార్కండేయులు, ప్రిన్సిపాల్ హేమ పాల్గొన్నారు.