కృష్ణ

బందరులో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): బందరు పట్టణంలో ఆదివారం సాయంత్రం చల్లటి గాలులతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం పడటంతో ప్రయాణీకులు, పాదచారులు తడిసిముద్దయ్యారు. అధిక ఉష్ణోగ్రతలకు అల్లాడుతున్న పట్టణ ప్రజలు చల్లటి గాలులతో కూడిన వర్షం పడటంతో సేదతీరారు. ప్రధాన రహదారి వర్షం నీరు కొంత మేర చేరుకున్నాయి. పల్లపు ప్రాంతాలు వర్షానికి నీటితో నిండాయి. ఏది ఏమైనా వర్షం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న రైతన్నలకు నేనున్నానంటూ వరణదేవుడు కరుణించటంతో నియోజకవర్గంలోని రైతులు ఖరీఫ్ సాగు చేసేందుకు సంసిద్ధమవుతున్నారనడంలో సందేహం లేదు.