తెలంగాణ

తలగడ కింద పేలిన మొబైల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతపల్లి, జూలై 9: తలగడ కింద పెట్టిన మొబైల్ ఫొన్ పెద్ద శబ్దంతో పేలిన సంఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. చింతపల్లి మండల కేంద్రానికి చెందిన విగ్రహాల దైవచారి తాను పడుకున్న సమయంలో తలగడ కింద ఒక ప్రముఖ కంపెనీకి చెందిన మొబైల్ పెట్టుకుని నిద్రించాడు. అర్థరాత్రి సమయంలో తలగడ నుంచి మరో వైపునకు తిరిగి పడుకున్న సమయంలో మొబైల్ ఫోన్ పెద్ద శబ్దంతో పేలిపోవడంతో తలగడకు పెద్ద రంధ్రం ఏర్పడింది. తృటిలో ప్రమాదం తప్పడంతో దైవాచారితో పాటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మొబైల్ ఫోన్లను తలగడ కింద కాని, పడుకునే సమయంలో పక్కన పెట్టుకుని నిద్రించడం సరి కాదని ఈ సంఘటన రుజువు చేసింది.

చిత్రాలు.. పేలిన మొబైల్.. రంధ్రం పడిన తలగడ