రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఆగస్టు 15: రంగారెడ్డి జిల్లాను మరింత అభివృద్ధి చేయడం కోసం అందరూ భాగస్వాములు కావాలని శాసనసభ ఉప సభాపతి టీ. పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకులు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉప సభాపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ మాసం నుంచి ఆసరా పెన్షన్లను రెండింతలు పెంచిందని చెప్పారు. జిల్లాలో లక్షా 73 వేల మందికి 38.77 కోట్ల రూపాయలు ఫించన్లు అందిస్తున్నట్లు వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద 1600 మంది బీసీలకు రూ.15 కోట్లు, 442 మంది ఎస్సీలకు రూ.4కోట్ల 33 లక్షలు, 299 మంది గిరిజనులకు రూ.2 కోట్ల 91 లక్షలు, షాదీ ముబారక్ కింద 807 మందికి 87 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం చేసినట్లు పద్మారావు తెలిపారు. జిల్లాలో 243 ఉన్నత పాఠశాలల్లో 75 వేల మంది విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన చేస్తున్నామని, వసతి గృహాల్లో సన్న బియ్యంతో భోజనం చేయడంతో హాజరు శాతం పెరిగిందని చెప్పారు. జిల్లాలో కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా మొత్తం 34600 మంది గర్భిణులకు రూ.21.63 కోట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఓఆర్‌ఆర్‌కి వెలుపల ఉన్న 1069 ఆవాసాలు, రెండు మున్సిపాలిటీల్లోని సుమారు 11 లక్షల మంది ప్రజలకు సురక్షత నీరు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాలో ఆరు గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాల పరిధిలో 6777 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో మరో ఐదు వేల రెండు పడకల ఇళ్లను మంజూరు చేసినట్లు వివరించారు. రూ.146 కోట్ల వ్యయంతో ఫార్మా సిటీ అనుసంధానానికి కందుకూరు నుంచి యాచారం వరకు రూ.75 కోట్లతో గండిపేట నుంచి శంకర్‌పల్లి వరకు రోడ్డు విస్తరణ పనుల చేస్తున్నట్లు ఉప సభాపతి పేర్కొన్నారు. రూ.35200 కోట్లతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో 350 గ్రామాల పరిధిలోని 3.77 లక్షల ఎకరాలకు సాగు తాగునీరు అందిస్తున్నట్లు పద్మారావు తెలిపారు. హరితహారం కింద 2019లో 2కోట్ల 47 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. ముందుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, రంగారెడ్డి కలెక్టర్ లోకేష్ కుమార్‌తో కలసి జాతీయ పతాకం ఆవిష్కరించి పోలీసుల వందనం స్వీకరించారు. జిల్లాకు చెందిన ముఖ్య విభాగాలు చేస్తున్న సేవలను శకటాల ద్వారా ప్రదర్శించారు. వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలదించిన అధికారులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు. రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ హరీష్, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, క్రైం డీసీపీ ప్రియదర్శిని, షీ టీమ్ డీసీపీ అనసూయ పాల్గొన్నారు.