రంగారెడ్డి

అక్రమ నిర్మాణాలపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఆగస్టు 19: కీసర గ్రామంలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న సర్పంచ్ మాధురి, పంచాయతీ కార్యదర్శి నాగేశ్‌పై చర్యలు తీసుకోవాలని కీసర ఉపసర్పంచ్ కందాడి బాలమణి ప్రజాదర్భార్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న సర్పంచ్ మాధురి, కార్యదర్శి నగేశ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
ఘట్‌కేసర్ మున్సిపాలిటీ కమిషనర్‌గా అరుణ
ఘట్‌కేసర్, ఆగస్టు 19: ఘట్‌కేసర్ పురపాలక సంఘ కమిషనర్‌గా ఘట్‌కేసర్ ఎంపీడీవో అరుణ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఘట్‌కేసర్ పురపాలక సంఘ ఇన్‌చార్జి కమిషనర్‌గా పని చేసిన కీసర ఎంపీడీవో శశిరేఖ స్థానంలో అరుణను పూర్తి స్థాయి కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. అనంతరం కమిషనర్ అరుణ మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.
సరిహద్దులు చేపట్టాలి
మెహిదీపట్నం, ఆగస్టు 19: దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సరిహద్దులు చేపట్టాలని గుడిమల్కాపూర్ కార్పొరేటర్ బంగారు ప్రకాష్ వక్ఫ్‌బోర్డు అధికారులను డిమాండ్ చేశారు.
అక్రమ కట్టడాలు సహించేది లేదు
మెహిదీపట్నం, ఆగస్టు 19: ఆక్రమ కట్టడాలు సహించేది లేదని జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోనల్ కమిషనర్ ముష్రాఫ్ అలీ హెచ్చరించారు. సోమవారం పలు ప్రాంతాలల్లో అక్రమ కట్టడాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. కమిషనర్ మాట్లాడుతూ నూతన భవనాలు నిర్మిస్తే, అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు.