Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరువాత మసక వెలుతురులో
చెట్ల మేఘాలు.. సహజ
ఛందస్సహితాలైన కోమల శబ్దాల్ని
చినుకులు చేసి వినుకలి కానుకలుగా
ఒలికిస్తున్నాయి..
ఉదయం ఊదారంగు ‘జెండా’ నెగరేయగానే
కిరణాల బాధ్యతల్ని నెత్తికెత్తుకొని
వ్యక్తిమయకోశమైన ప్రపంచమంతా
జీవన సమరానికి తయారౌతుంది, స్వప్నాల కాటుపడని
మనుషులు మనుషులుగా వీధులన్నీ
తొందరను ప్రవహిస్తూ..
మృత్యువును శ్వాసించే జన్మని
శాంతి తీరాన్ని చేర్చటంలో
ఉదధుల్ని ఈదాడు- ఉపద్రవాలతో యుద్ధం చేశాడు
మానవుడు మాటల్ని మూటగట్టి
మరణించిన నది ఒడ్డున కాలగీతాల్ని విన్నాడు..
వ్యక్తావ్యక్తాల నడుమ వ్యయమైపోతున్న ఊహాశబలతల్ని
ఇతిహాసం వైపు ప్రయాణం చేయించాడు
వాడు
చేయి చాపితే వసంతగీతి
చేతలుడిగితే శ్వథ శైశిర పలాశ రీతి
ఈ మధ్యకాలమంతా మహా సంగ్రామం
అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం
చేశాడు చేస్తున్నాడు.. చేస్తాడు
ఇంకా ఉంది