సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మహాప్రభూ! నా గుట్టు తెలిసిపోయినది. నేనింక నిక్కడ నుండుటకు గుండె దడ ఎత్తుచున్నది. నేను పాఱిపోయెదను.’’ఇట్లనుచు, ఆ మాదిగ యదేపోకగా బాఱిపోయెను.
ఈ విధముగనే మాయయొక్క గుట్టు కనుగొనినంతనే యది తొలగిపోవును.
నారదుని సంసారమోహము
1111. మాయ యిట్టిదని తెలియరానిది. ఒకనాడు నారదుడు శ్రీహరిని సమీపించి ‘స్వామీ! అసాధ్యమును సాధ్యముగా జేయు నీ మాయను నాకు జూపుము’’అని వేడుకొనెను. శ్రీహరి ‘‘సరియే’’యని తలపంకించెను. అటుపిమ్మట నొకనాడు శ్రీహరి నారదుని దనవెంట బెట్టుకొని యొకానొకచోటికి బ్రయాణమయ్యెను. కొంత దూరము వెడలిన పిమ్మట శ్రీహరికి దాహమయ్యెను. చాలడస్సి కూర్చుండి, ‘‘నారదా! నాకు జాల దాహమగుచున్నది. ఎచటికైనను బోయి కొంచెము నీరు తెమ్ము’’అనెను. నారదుడు వెంటనే నీరు వెదకుటకై పరుగిడెను.
దాపున నెక్కడను నీరు చిక్కలేదు. చాల దూరముపోగా వేఱొకటి యున్నటుల గాన్పించినది. నారదుడాయేటి యొద్దకుబోగా నచటనొక దివ్య సుందరాంగి కూర్చుండి యుండెను. ఆమె సౌందర్యమును జూచి నారదుడు మోహితుడయ్యెను. సమీపమునకు బోగా, నామె మృదుమధుర వాక్కుల నారదుని బలుకరించెను. అచిరకాలముననే యొండొరులను బ్రేమించుకొనిరి. నారదుడామెను బెండ్లియాడి యామెతో గాపురము చేయసాగెను. కాలక్రమమున నాతనికామెవలన సంతానము కలిగినది.
ఇట్లు నారదుడాలుబిడ్డలతో మహానందముగా గాలము గడపుచుండగా, ఆ దేశములో గొప్ప కాటకము సంభవించినది. మృత్యువు వేనవేలు జనులను దన పొట్టను బెట్టుకొనుచుండెను. అంత నారదుడాచోటు విడిచి మఱియొకచోటికి బోవుట మంచిదని భార్యతో జెప్పెను. భార్య సమ్మతింప వారిరువురును బిడ్డలను జేతులుపట్టుకొని నడిపించుచు నిల్లు విడిచి పయనమైరి. వారొక వంతెనమీదుగా పోవుచుండ హఠాత్తుగా బెద్దవరద వచ్చెను. ప్రవాహవేగమున బిల్లలందఱును నొక్కొక్కరే కొట్టుకొనిపోయిరి. తుదకు భార్యయు నీటిలో మునిగిపోయినది. దుఃఖపరవశుడై నారదుడు నదియొడ్డున జదికిలబడి బోరున విలపింపసాగెను. ఆ సమయమున శ్రీహరి సమీపించి, ‘‘నారదా! మంచినీరేది? నీవిటులేడ్చుచున్నావెందులకు?’’అని పలుకరించెను. స్వామిని గాంచి నారదుడులికిపడి లేచెను. జరిగిన సంగతి యంతయు నారదునకు దెల్లమైనది. అంతనాతడు చేతులు జోడించుకొని, ‘‘ప్రభో! నీకు పదివేల నమస్కారములు! అత్యద్భుతమైన నీ మహామాయకు కోటి నమస్కారములు!!’’అని పలికెను.
‘‘గొర్రె పులి’’
1112. ఒక పెద్దపులి గొఱ్ఱెల మందపైబడెను. అది నిండు చూలుతో నుండుటచే, మందమీదికి దూకగనే రుూని చనిపోయినది. పులికూన మాత్రమెట్లో బ్రతికి గొఱ్ఱెల మధ్య బెరుగసాగెను. గొఱ్ఱెలు పొలములో మేత మేయుచుండనదియు మేత మేయనేర్చెను. అవి యఱచినట్లె యిదియు నఱచెడిది. కొంతకాలమునకది పెరిగి పెద్దపులియైనది. ఒకనాడు విధి వశమున మఱియొక పెద్దపులి గొఱ్ఱెల మందపై బడినది. కాని మందలోనున్న రుూ గొఱ్ఱె పులిని జూచి యది యాశ్చర్యపడి దీనిని దఱిమి మెడపట్టి రుూడ్చినది. - ఇంకాఉంది