తెలంగాణ

మహిళా ఉద్యోగిని వేధించిన కేసులో సిఐడి ఇన్‌స్పెక్టర్‌కు రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీగల్ (కరీంనగర్), ఏప్రిల్ 18: వ్యవసాయ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళను వేధింపులకు గురిచేస్తూ సెల్‌ఫోన్‌లో అసభ్యకరమైన పదాలతో వాట్సాప్‌లో మెస్సేజ్‌లు పంపిన హైదరాబాద్ సిఐడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కట్ట దయాకర్ రెడ్డి (54)ని కరీంనగర్ రెండవ పట్టణ పోలీసులు అదనపు జూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మాధవి ఎదుట సోమవారం రాత్రి హాజరుపర్చారు. ఇటీవల జిల్లాలో సంచలనం రేకెత్తించిన కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత ప్రసాద రావు ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎఎస్‌ఐ బొబ్బల మోహన్ రెడ్డి కేసులో సాక్షులను విచారించేందుకు హైదరాబాద్ సిఐడి ఇన్‌స్పెక్టర్ దయాకర్ రెడ్డిని నియమించింది. ఈ కేసు విచారణలో భాగంగా కరీంనగర్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ (45) కేసు విచారణ నిమిత్తం కరీంనగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు పిలిపించి మహిళ సెల్‌ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆయా సెల్‌ఫోన్‌లో మహిళ గూర్చి వాట్సాప్‌లో అసభ్యకరమైన మెసేజ్ చేయడం, తీవ్రంగా వేదించడం, చంపుతానని బెదిరించడం పలు రకాల మెసేజ్‌లు చేయడంతో భర్తను కోల్పోయిన ఆ మహిళ తీవ్ర బాధలో ఉండడంతో ఆవేదనకు గురైంది. సిఐడి ఇన్‌స్పెక్టర్ దయాకర్ రెడ్డి బాధలు భరించలేక కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 2న ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపర్చారు. అనంతరం న్యాయమూర్తి మాధవి నిందితుడు కట్ట దయాకర్ రెడ్డికి బెయిలు మంజూరు చేస్తూ ఇద్దరు జమానులతో ఐదు వేల రూపాయల సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశాలు జారీ చేస్తూ వచ్చే నెల మే 2న కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు.

కోర్టులో హాజరుపర్చేందుకు
తీసుకువచ్చిన పోలీసులు