తెలంగాణ

యురేనియం అనే్వషణను ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: యురేనియం అనే్వషణను నిలుపుదల చేయాలని అఖిల పక్ష నేతలవు, మేధావులు, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. దీనిపై కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. యురేనియం కోసం తవ్వకాలు జరపాల్సిన అవసరం లేదని భారత్, యూఏఎస్ మధ్య ఒప్పందం జరిగిన తర్వాత కొనుగోలు సులుభతరం అయిందన్నారు. న్యూక్లియర్‌కు అవసరం అయితే కొనుగోలు చేయాలి తప్ప తవ్వకాలు జరపాల్సిన అవసరం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్తు చేశారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన హైదరాబాద్‌లో సోమవారం యురేనియం తవ్వకాలపై అఖిల పక్ష నేతలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ తరఫున ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి, విహెచ్ హనుమంతరావు, తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం నేతలు సీతారామ్, నాగయ్య, ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్, మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. యురేనియం తవ్వకాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, దీనిపై కార్యాచరణకు పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అధ్వర్యంలో కమిటీ వేశామన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో యురేనియం తవ్వడం అత్యంత ప్రమాదకరమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యదర్శి వి హనుమంతరావు మాట్లాడుతూ, యురేనియంకు వ్యతిరేకంగా తెలంగాణలో తాము ఆంధ్రలో పవన్‌కల్యాణ్ పోరాటం చేయాలన్నారు. దేశానికి అవసరమైతే యురేనియాన్ని కొనుగోలు చేయండి తప్ప గిరిజనం ప్రాణాలతో చెలాగాటం ఆడవద్దన్నారు. దీనిపై మొదట పవన్ కల్యాణ్ స్పందించాకే ఇతర నటులు స్పందించారన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కూడా ఆహ్వానించింనప్పటికీ అమిత్ షా వద్దన్నరేమో రాలేదని విహెచ్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అయినా తమను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి మెమోరండం ఇప్పించాలన్నారు.
ఇలా ఉండగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్ మాట్లాడుతూ, యురేనియం తవ్వకాలపై కేంద్రం ఉపసంహరించుకున్నట్టు ప్రకటించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. యురేనియం తవ్వకాలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పరస్పర విరుద్దమైన ప్రకటనలు చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రకృతి ప్రేమికులు కాదని, అదే నిజమైతే స్టేట్ బోర్డు ఆఫ్ వైల్డ్ లైఫ్ సమావేశాలకు వచ్చే వారని గుర్తు చేశారు.