తెలంగాణ

క్షేత్రస్థాయి విధులతోనే మెరుగైన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: పశుసంవర్థక శాఖ అధికారులు క్షేత్ర స్థాయి విధులకు వెళితేనే ప్రజలకు మెరుగైన సేవలందించగలరని రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆదేశించారు. సోమవారం ఆయన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పశుసంవర్థక శాఖ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం పశుసంవర్థక, మత్స్య శాఖలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని వివరించారు. దేశ అభివృద్ధి జరగాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలని గుర్తించిన ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా పశుసంవర్థక శాఖకు ప్రాధాన్యతిస్తుందని తెలిపారు. గ్రామీణ రైతుల అవగాహన కోసం సదస్సులను ఏర్పాటు చేసి వారికి పశు అభివృద్ధికి తీసుకోవల్సిన చర్యల గురించి వివరించాలని ఆదేశించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించే క్రమంగా పశువైద్య శాలలకు వెళ్లి సిబ్బంది హాజరుశాతం, అందుబాటులో ఉన్న మందులు తదితర అంశాలను ఎప్పటికపుడు సరి చూసుకోవాలని సూచించారు. వచ్చే మూడు నెలల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను అభివృద్ధి చేసేందుకు స్థలాను గుర్తించి నివేదిక సమర్పించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది అంతా పశుసంవర్థక శాఖకు మంచి పేరు తెచ్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడుతూ రైతాంగం అభివృద్ధి దశలో పయనించాలంటే పాడి అభివృద్ధి, మత్స్య అభివృద్ధి తప్పనిసరి అని గుర్తించిన ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సఫలీకృతం కావాలంటే పశు అరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వివరించారు. పశు వైద్యశాలలతో పాటు మొబైల్ పశు క్లీనిక్‌లను కూడా ఏర్పాటు చేసి వైద్యసేవలను అందించటం జరుగుతుందని వివరించారు. డీవామింగ్ వ్యాక్సినేషన్ సకాలంలో అందించాలని సూచించారు. శాఖ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి పశుగ్రాసం పెంచే దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో భాగంగా డ్రగ్ మేనేజ్‌మెంట్ సిస్టం మొబైల్ యాప్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సమావేశంలో పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డా.లక్ష్మారెడ్డి, అదనపు డైరెక్టర్ డా.రామచంద్ర, టీఎస్‌ఎల్‌డీఏ సీఈఓ మంజువాణి, విజయాడైరీ ఎండీ శ్రీనివాస్‌రావుతో పాటు వివిధ జిల్లాలకు చెందిన పశుసంవర్థక శాఖ డైరెక్టర్లు పాల్గొన్నారు.

*చిత్రం...పశుసంవర్థక శాఖ సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్